News October 11, 2025

VZM: పెళ్లి ఇష్టం లేదని యువతి ఆత్మహత్య

image

వివాహం చేసుకోమని ఆమె తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో అయ్యకోనేరు గట్టు చెరువులో పడి యువతి ఆత్మహత్య చేసుకుంది. టౌన్ ఎస్ఐ కనకరాజు తెలిపిన వివరాల ప్రకారం.. బెహరా రమ్య(18) డిగ్రీ చదువుతోంది. వివాహం చేస్తామని ఆమెకు చెప్పగా ముందు తన అన్నయ్యకు చేయమంది. వినకుండా బలవంతం చేయడంతో శుక్రవారం రాత్రి ఇళ్లు వదిలి వెళ్లిందన్నారు. ఈరోజు చెరువులో మృతదేహం తేలడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

Similar News

News October 12, 2025

VZM: ‘జీఎస్టీ చెల్లింపులపై అవగాహన కల్పించడమే ఎగ్జిబిషన్ లక్ష్యం’

image

జీఎస్టీ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్‌ సేల్స్‌కు విశేష స్పందన లభించిందని జీఎస్టీ జాయింట్ కమిషనర్ నిర్మల జ్యోతి తెలిపారు. స్థానిక సంగీత కళాశాలలో ప్రదర్శనను శనివారం సందర్శించారు. తక్కువ ధరలకు నాణ్యమైన ఉత్పత్తులు కొనుగోలు చేసి సుమారు రూ.25 వేలు వరకు ప్రజలు లబ్ధి పొందారని చెప్పారు. జీఎస్టీ చెల్లింపులపై అవగాహన పెంచడమే ఈ ఎగ్జిబిషన్ లక్ష్యమని పేర్కొన్నారు.

News October 10, 2025

పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి: VZM SP

image

విజయనగరం జిల్లా పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రత్యేకంగా ‘పోలీసు వెల్ఫేర్ డే’ కార్యక్రమాన్ని తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది నుంచి వ్యక్తిగత, శాఖాపరమైన విజ్ఞాపనలు స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపడతానని తెలిపారు. పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, ప్రతి సమస్యపై స్వయంగా స్పందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

News October 10, 2025

VZM: జిల్లా అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

విజయనగరం జిల్లాలో రేపటి నుంచి రెండు రోజుల పాటు ఎలక్ట్రానిక్ పరికరాల ఎగ్జిబిషన్ కం సేల్ నిర్వహించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. అధికారులతో శుక్రవారం వీసీ నిర్వహించి పలు సూచనలు చేశారు. మండల స్థాయి, నియోజకవర్గం, మున్సిపాలిటీ & జిల్లా స్థాయిలో ఈ ఎగ్జిబిషన్‌లు జరగాలన్నారు. ప్రజలకు GST అవగాహనతో పాటు తక్కువ ధరల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.