News July 3, 2024
VZM: పోక్సో కేసులో నిందితులకు జైలు శిక్ష
బాలికను అపహరించి.. అసభ్యంగా ప్రవర్తించినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో స్థానిక దిశ పోలీస్ స్టేషన్‌లో 2021లో పోక్సో కేసు నమోదయ్యింది. ఈ కేసులోని నిందితులకు కోర్టు జైలు శిక్ష విధించిందని దిశ సీఐ నాగేశ్వరరావు తెలిపారు. నిందితులుగా ఉన్న పూసపాటిరేగ మం. తిప్పలవలసకు చెందిన రాగితి.సత్తయ్య(A1)కు రూ.2,500 జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష, వాసుపల్లి కన్నయ్య(A2)కు రూ.500 జరిమానా, ఏడాది శిక్ష ఖరారైందని చెప్పారు.
Similar News
News November 27, 2024
విశాఖ-కోరాపుట్ ప్యాసింజర్ రద్దు
కోమటిపల్లి, రాయగడ, విజయనగరం మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా విశాఖపట్నం-కోరాపుట్(08546) ప్యాసింజర్‌ను అధికారులు రద్దు చేశారు. ఈనెల 29 నుంచి వచ్చే నెల 4వతేదీ వరకు ప్యాసింజర్ రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. కోరాపుట్- విశాఖపట్నం ఈనెల 29 నుంచి డిసెంబర్ 5 వరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 26, 2024
విజయనగరంలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
విజయనగరం ఏపీఎస్పీ బెటాలియన్ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. పోలీసులు వివరాల ప్రకారం.. భోగాపురం మండలం గూడెపువలసకి చెందిన రమేశ్ (25) విజయనగరం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ముందున్న బొలేరోని ఢీకొన్నాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమేశ్‌ని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీనిపై డెంకాడ ఎస్.ఐ ఏ. సన్యాసినాయుడు కేసు నమోదు చేశారు.
News November 26, 2024
IPL వేలంలో విజయనగరం కుర్రాడికి చుక్కెదురు
ఐపీఎల్ మెగా వేలంలో విజయనగరం జిల్లా గరివిడికి చెందిన బైలపూడి యశ్వంత్ రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో తన పేరును రిజిస్టర్ చేసుకున్నారు. ఈయన రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్‌గా క్రికెట్‌లో రాణిస్తున్నాడు. అయితే వేలంలో అతనికి చుక్కెదురయ్యింది. ఏ ఫ్రాంఛైజీ తనను తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. దీంతో విజయనగరం వాసులు, అభిమానులు నిరాశ చెందారు.