News August 21, 2025
VZM: పోలీస్ కార్యాలయంలో నేర సమీక్ష

జిల్లా పోలీస్ కార్యాలయంలో మాసాంతర నేర సమీక్షను ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం నిర్వహించారు. దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, SDPS, పోక్సో, అట్రాసిటీ, రోడ్డు ప్రమాద కేసులు, లాంగ్ పెండింగ్ కేసులపై సమీక్షించారు. న్యాయస్థానాలను సంబంధిత అధికారులు తరచూ సందర్శించి కేసుల ప్రాసిక్యూషన్ జరుగుతున్న తీరును గమనించాలన్నారు. PGRS ఫిర్యాదులు తాము సూచించిన అధికారులు మాత్రమే విచారణ చేయాలన్నారు.
Similar News
News August 21, 2025
VZM: ఏసీబీ వలలో వీఆర్వో

విజయనగరం జిల్లాలోని వేపాడ మండలం సింగరాయి గ్రామంలో వీఆర్వోగా పనిచేస్తున్న సత్యవతి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం చిక్కారు. ఓ రైతు నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ రైడ్‌కు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News August 21, 2025
దివ్యాంగులకు అండగా నిలబడండి: చిన్న శ్రీను

దివ్యాంగుల పింఛన్లు పొందుతూ అనర్హత నోటీసులు అందుకున్న బాధితులకు ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీలు అండగా నిలబడాలని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గురువారం పిలుపునిచ్చారు. తొలగించిన పింఛన్ల పునః పరిశీలనకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిన నేపథ్యంలో వాస్తవంగా అర్హత కలిగిన వారిని గుర్తించి ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకునేందుకు సహకరించాలన్నారు.
News August 21, 2025
గణేశ్ మండపాల ఏర్పాటుకు ఎస్పీ సూచనలు ఇవే..

గణేశ్ మండపాల ఏర్పాటుకు విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం పలు సూచనలు చేశారు.
➣ఎటువంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదు
➣సింగిల్ విండో విధానంతో https://ganeshutsav.net లింక్ ద్వారా అనుమతులు
➣విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు వివరాలు తప్పనిసరి
➣కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు, అనుపు తేదీ ముందే చెప్పాలి
➣NOC పొందిన తరువాత ప్రింట్ తీసుకొని మండపంలో భద్రపరచాలి