News May 5, 2024
VZM: పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న వారు
ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తిస్తూ వేరే జిల్లాలలో ఓటరుగా నమోదు అయి ఉన్న 6,812 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును ఆదివారం వినియోగించుకున్నారు.
➠విజయనగరం: 1356
➠చీపురుపల్లి: 385
➠గజపతినగరం: 603
➠నెల్లిమర్ల: 587
➠బొబ్బిలి: 749
➠ఎస్.కోట: 563
➠పార్వతీపురం: 1098
➠కురుపాం: 925
➠సాలూరు: 546
Similar News
News November 29, 2024
విజయనగరం జిల్లాలో విషాదం
ఎస్.కోట మండలంలో 2 వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఎస్.కోటకు చెందిన విశాలక్ష్మి (86) బుధవారం వంట చేస్తుండగా చీరకు నిప్పు అంటుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను విశాఖ తరలించగా అక్కడ చికిత్సపొందుతూ గురువారం మృతిచెందారు. అదేవిధంగా వెంకటరమణ పేట గ్రామానికి చెందిన సన్నమ్మ మెట్ల నుంచి జారిపడగా మెరుగైన చికిత్స కోసం KGHకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు.
News November 29, 2024
గంజాయి రవాణాపై 289 కేసులు: DIG
గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు ఎటువంటి సమాచారం ఉన్నా 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని డీఐజీ గోపీనాథ్ జెట్టీ విజ్ఞప్తి చేశారు. చీపురుపల్లి డీఎస్పీ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. ఇప్పటివరకు గంజాయి రవాణాపై 289 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాకు డైనమిక్ చెక్ పోస్టులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 29 స్పెషల్ టీములను గంజాయి రవాణా అరికట్టేందుకు నియమించాన్నారు.
News November 28, 2024
గంజాయి రవాణాపై 289 కేసులు: DIG
గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు ఎటువంటి సమాచారం ఉన్న 1972 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలని డీఐజీ గోపీనాథ్ జెట్టీ విజ్ఞప్తి చేశారు. చీపురుపల్లి డీఎస్పీ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. ఇప్పటివరకు గంజాయి రవాణాపై 289 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాకు డైనమిక్ చెక్ పోస్టులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 29 స్పెషల్ టీములను గంజాయి రవాణా అరికట్టేందుకు నియమించాన్నారు.