News October 21, 2024

VZM: ప్రజా వినతుల పరిష్కార వేదికకు 180 వినతులు

image

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదికకు మొత్తం 180 అర్జీలు అందాయి. భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ శాఖకు అత్యధికంగా 122 వినతులు అందాయి. పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డీఆర్డీఏకు 17 వినతులు అందాయి. మున్సిపాలిటీకి 5, పంచాయితీ శాఖకు 12, విద్యా శాఖకు 4 అందగా, వైద్య శాఖకు 6 అందాయి. మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి.

Similar News

News November 23, 2024

విజయనగరం: మొదట ప్రేమ.. ఆపై చీటింగ్

image

మహిళను మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు విజయనగరం DSP శుక్రవారం తెలిపారు. గంట్యాడలోని కిర్తిబర్తికి చెందిన వెంకట సత్యం ఓ కళాశాలలో ఫ్యాకల్టీగా చేసేవాడు. అదే కళాశాలలో ఫ్యాకల్టీగా ఉన్న దళిత మహిళకు ప్రేమ పేరుతో దగ్గరై శారీరకంగా వాడుకుని పెళ్లికి నిరాకరించారు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అతడిని గురువారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు.

News November 23, 2024

విజయనగరంలో నేటి నుంచి T20 .. షెడ్యూల్ ఇదే

image

స్థానిక PVG రాజు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌‌లో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ క్రికెట్‌ మ్యాచ్‌ల నిర్వహణకు ACA అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం నుంచి ఉదయం 11 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి రోజు అస్సాం–రైల్వేస్‌, 25న ఒడిస్సా–రైల్వేస్, 27న విదర్భ–పుదిచ్చేరి, 29న చండీగఢ్‌–ఛత్తీస్‌గఢ్‌, డిసెంబర్1న అస్సాం–పుదిచ్చేరి, 3న ఛత్తీస్‌గఢ్‌–విదర్భ, 5న చండీగఢ్‌–ఒడిశా జట్ల మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి.

News November 23, 2024

VZM: మహిళ ఎమ్మెల్యేలతో హోంమంత్రి సెల్ఫీ

image

ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంతో ముగియడంతో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన మహిళా ఎమ్మెల్యేలు శుక్రవారం సందడి చేశారు. మహిళా ఎమ్మెల్యేలందరూ ఓ చోట చేరి సరదాగా గడిపారు. రాష్ట్ర హోంమంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనిత సెల్ఫీ తీయగా.. ఆమెతో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఫోటో దిగారు.