News September 19, 2024
VZM: ప్రభుత్వం నుంచి లోన్ తీసుకున్న మంత్రి

రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖామంత్రి గుమ్మిడి సంధ్యారాణికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల రుణం మంజూరు చేసింది. సొంతకారు కొనుగోలు కోసం ప్రభుత్వం ఈ రుణం ఇచ్చింది. ఆమె వేతనం నుంచి 30 వాయిదాల్లో ప్రభుత్వం రుణాన్ని మినహాయించుకుంటుంది. మంత్రి హోదాలో ప్రస్తుతం ఆమెకు ప్రభుత్వం ప్రోటోకాల్ కాన్వాయ్ ఇస్తున్నప్పటికీ, సొంత కారు కోసం ఆమె ప్రభుత్వం నుంచి లోన్ తీసుకున్నారు.
Similar News
News October 2, 2025
గోవిందపురం: రేబిస్ లక్షణాలతో మృతి

సంతకవిటి మండలం గోవిందపురం గ్రామంలో అదపాక లింగంనాయుడు (37) రాబిస్ లక్షణాలతో మృతి చెందాడు. లింగంనాయుడికి ఆగస్టు 30న వీధి కుక్క కరిచింది. దీంతో PHCలో మూడు వ్యాక్సిన్లు వేయించుకున్నాడు. ఈ మధ్య అనారోగ్యానికి గురి కాగా.. రాబిస్ లక్షణాలు ఉన్నాయని విశాఖ తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. లింగంనాయుడు కొద్ది రోజుల్లో సింగపూర్ వెళ్లబోతున్న తరుణంలో ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
News October 2, 2025
జిల్లా అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా హాజరు కావాలి: VZM కలెక్టర్

మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా.. ఆ ఇద్దరు మహనీయులకు నివాళి అర్పించే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రామ సుందర్ రెడ్డి బుధవారం తెలిపారు. ఉదయం 8.30 గంటలకు కలెక్టరేట్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి, శాస్త్రి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొనాలని ఆదేశించారు.
News October 2, 2025
వేంకటేశ్వర స్వామి నాకు ప్రాణబిక్ష పెట్టారు: చంద్రబాబు

నా పై 24 క్లెమోర్ మైన్స్ పేల్చితే.. సాక్షాత్తు ఆ వేంకటేశ్వర స్వామే ప్రాణబిక్ష పెట్టారని సీఎం చంద్రబాబు అన్నారు. దత్తిలో ఆయన మాట్లాడుతూ.. ఆ స్వామి ఆశీస్సులతో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తానన్నారు. ఆనాడు ఎన్టీఆర్ తిరుమలలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత టీటీడీ ఆధ్వర్యంలో నడిచే అన్ని దేవాలయాల్లోనూ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.