News March 27, 2024

VZM: ‘ప్రభుత్వ భవనాలపై పార్టీల రంగులు తొలగించాలి’

image

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, భవనాలపై ఉన్న పార్టీల రంగులను తొలగించాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు, ప్రవర్తన నియమావళి అమలు తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సీఈఓ ముఖేశ్ కుమార్‌ మీనా జిల్లా కలెక్టర్‌లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

Similar News

News September 25, 2025

VZM: రేపు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పర్యటన

image

రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌ పర్సన్‌ డాక్టర్ రాయపాటి శైలజ శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విమలారాణి గురువారం తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగే ‘నవరాత్రి పోషణ్ మహా ప్రోగ్రాం’ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం వన్ స్టాప్ సెంటర్‌ను సందర్శించనున్నారని చెప్పారు.

News September 25, 2025

స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం ప్రారంభించిన కలెక్టర్

image

విజయనగరం కలెక్టరేట్‌లో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ తమ పరిసరాల పరిశుభ్రతకు పాటు పడాలని పిలుపునిచ్చారు. రోజుకో ఓ గంట సమయం సేవకు కేటాయించాలని కలెక్టర్ సిబ్బందికి చెప్పారు. కలెక్టర్‌తో పాటు జేసీ సేదుమాధవన్, అధికారులు, నాయకులు, మున్సిపల్ తదితరులు ఉన్నారు.

News September 25, 2025

ఓటర్ల జాబితాను మ్యాప్ చేయండి: VZM కలెక్టర్

image

ఓటర్ల జాబితా సవరణ పై కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో కలెక్టర్ రామ సుందర్ రెడ్డి బుధవారం సమీక్షించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2002 ఓటర్ల జాబితాతో 2025 ఓటర్ల జాబితాను మ్యాప్ చేయాలని తెలిపారు. ఓటర్ల సవరణ కోసం అందిన ఫారం 6, 7, 8ని నిర్దేశిత గడువు లోగా డిస్పోజ్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.