News January 21, 2025
VZM: ప్రభుత్వ శాఖలపై మంత్రి అనిత సమీక్ష

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి, రెవెన్యూ, డ్వామా కార్యక్రమాలపై ఆమె సమీక్ష జరిపారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, MP కలిశెట్టి అప్పలనాయుడు, MLA లు కిమిడి కళా వెంకట్రావు, కొండ్రు మురళీ మోహన్, కోళ్ల లలితకుమారి, లోకం నాగమాధవి, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 22, 2026
బొబ్బిలి: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

బొబ్బిలి పట్టణం కుమ్మరివీధిలో ఉంటున్న మర్రి మాధవిదేవి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. మాధవి చైతన్య పాఠశాలలో గణితం టీచర్‌గా పని చేస్తున్నారు. కొంతకాలంగా ఆమెను భర్త నరేశ్ అనుమానంతో వేధిస్తున్నాడు. నీవు చనిపోతేనే దరిద్రం పోతుందని పదే పదే అనడంతో మనస్తాపానికి గురైన మాధవి శనివారం రాత్రి ఉరివేసుకుందని ఆమె తల్లి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసినట్లు CI నారాయణరావు చెప్పారు.
News February 22, 2026
VZM: బిల్లులు ఎప్పుడు?

విజయనగరం జిల్లాలో పెండింగ్ గృహ బిల్లుల సమస్యపై లబ్ధిదారుల్లో అసంతృప్తి పెరుగుతోంది. గతంలో మంజూరైన ఇళ్లకు చెల్లింపులు జరగక అనేక నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. 2024లో సర్వే నిర్వహించి 24,000 ఇళ్లు అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించారు. వీటికి సుమారు రూ.19 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. బిల్లులు విడుదలైతే ఇళ్లను పూర్తిచేసుకునేందుకు లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
News February 22, 2026
VZM: ఘనంగా పారా బాడ్మింటన్ జిల్లా స్థాయి పోటీలు

రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం పారా బాడ్మింటన్ జిల్లా స్థాయి పోటీలు ప్రారంభమయ్యాయి. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.దయానంద్ మాట్లాడుతూ.. వీల్ ఛైర్, ఆర్థో కేటగిరిలకు సంబందించి మెన్, ఉమెన్ విభాగాలకు పోటీలు నిర్వహించామని, జిల్లా వ్యాప్తంగా 28 మంది హాజరు కాగా 20 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఎంపికైన వారు ఈనెల 25, 26 తేదీల్లో జిల్లాలో జరుగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనున్నారు.


