News March 3, 2026
VZM: బర్త్‌డే.. డెత్ డే

ఆరిలోవ హెల్త్ సిటీ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు విజయనగరం (D) గజపతినగరం (M) రామన్నపేటకు చెందిన సాయికిరణ్‌గా పోలీసులు గుర్తించారు. సాయికిరణ్ ఉషోదయ జంక్షన్‌లో నివాసం ఉంటున్నాడు. సోమవారం తన పుట్టినరోజు కావడంతో బైక్‌పై సింహాచలం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు SI ధర్మేందర్ తెలిపారు.
Similar News
News March 3, 2026
మంత్రి టీజీ భరత్ ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చర్చకు సిద్ధమా?

ఈ రెండేళ్లలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఎన్ని పరిశ్రమలు తీసుకోచ్చారు? యువతకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చర్చకు సిద్ధమా అని వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం కర్నూలులో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు రెడ్ బుక్ పాలనలో పారిశ్రామిక వేత్తలు పరారవుతున్నారన్నారు. రాష్ట్రంలో పబ్‌లు తప్ప హబ్‌లు లేవన్నారు. కార్మిక రంగాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు.
News March 3, 2026
ప్రొద్దుటూరులో తగ్గిన బంగారం ధర

ప్రొద్దుటూరులో మంగళవారం బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.16,700
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,364
* 10 గ్రాముల వెండి ధర రూ.2,800.
నిన్న 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.17,000 ఉండగా నేడు రూ.300 తగ్గి రూ.16,700కు చేరింది.
News March 3, 2026
హార్ముజ్‌లో నిలిచిపోయిన 700+ నౌకలు

హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో ఆ మార్గంలో ఇరువైపులా 700+ నౌకలు నిలిచిపోయాయి. వీటిల్లో 334 క్రూడ్ ఆయిల్, 263 శుద్ధి చేసిన, 109 శుద్ధి చేయని చమురు తదితర ట్యాంకులున్నాయి. మార్చి 1వ తేదీనే ఈ మార్గంలో రాకపోకలకు భయపడి కేవలం 3 ట్యాంకర్లతో 2.8M బ్యారెల్స్ చమురునే నౌకలు తరలించాయి. సాధారణ రాకపోకలకు పోలిస్తే ఇది 86% తగ్గినట్లే. నిన్న ఓ చిన్న ట్యాంకర్, కార్గో షిప్ మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించాయి.


