News August 19, 2025

VZM: బార్ షాపులకు దరఖాస్తులు చేసుకోవాలి

image

ఉమ్మడి జిల్లాలో నూతన మద్యం బార్‌ షాపులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనాథుడు సోమవారం తెలిపారు. విజయనగరం జిల్లాలో 28, మన్యం జిల్లాలో 8 మద్యం బార్‌ షాపులకు ఈనెల 26 వరకు ఆన్‌లైన్‌ లేదా నేరుగా ఆయా జిల్లా కలెక్టరేట్లలో ఉండే సూపరింటెండెంట్‌ కార్యాలయంలో దరఖాస్తులను అందించాలన్నారు. ఒక్కో బార్‌‌కు నాలుగు దరఖాస్తులు పైబడి వస్తేనే డ్రా తీస్తామని, లేదంటే గడువు పెంచుతామన్నారు.

Similar News

News August 19, 2025

తగ్గిన బంగారం ధరలు

image

గత కొంతకాలంగా కొనుగోలుదారులకు షాకిస్తూ వచ్చిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.430 తగ్గి రూ.1,00,750కు చేరింది. 10 రోజుల్లో మొత్తం ₹2,560 తగ్గింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.400 పతనమై రూ.92,350 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,27,100గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News August 19, 2025

నిర్మల్ జిల్లాలో 428.2 మి.మీ వర్షపాతం

image

నిర్మల్ జిల్లాలో గడిచిన 24గంటల్లో 428.2మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కుబీర్14.2, తానూర్13.8, బాసర8.4, ముధోల్ 15.2, భైంసా 18.4, కుంటాల 30.8, నర్సాపూర్ 18.2, లోకేశ్వరం 18.4, దిలావర్పూర్ 25.4, సారంగాపూర్ 37.2, నిర్మల్ 32.6, నిర్మల్ రూరల్ 26.4, సోన్ 24.4, లక్ష్మణచందా 17.2, మమడ 25.2, పెంబి 27.6, ఖానాపూర్ 22.2, కడెం 21.2, దస్తురాబాద్ 31.4 మి.మీ వర్షపాతం నమోదయిందన్నారు.

News August 19, 2025

రూ. వెయ్యి జరిమానా: కర్నూలు ట్రాఫిక్ సీఐ

image

కర్నూలులో హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే యజమానులకు జరిమానా విధిస్తున్నట్లు కర్నూల్ ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ వెల్లడించారు. సోమవారం సీఐ ట్రాఫిక్ పోలీసులతో కలిసి సి.క్యాంప్, బళ్లారి చౌరస్తా, రాజ్ విహార్ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ ఉన్న వాహనదారులకు రోజా పువ్వు ఇచ్చి, హెల్మెట్ లేని 100 మందికి రూ. 1000 చొప్పున జరిమానా విధించామన్నారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరని సూచించారు.