News November 30, 2024
VZM: భార్య, కుమారుడి మృతి.. భర్త ఆత్మహత్య
పటాన్‌చెరు పరిధిలో విజయనగరం జిల్లా వాసి శుక్రవారం మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. విజయనగరం జిల్లా డెంకాడ మండలం రామచంద్రాపురానికి చెందిన రామానాయుడు(38) భార్యతో కలిసి HYD వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా 9ఏళ్ల క్రితం భార్య సూసైడ్ చేసుకోగా పిల్లలు అత్తామామల వద్ద ఉంటున్నారు. 4 నెలల క్రితం చిన్న కొడుకు చెరువులో పడి చనిపోయాడు. కుమిలిపోయిన అతడు బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయాడు.
Similar News
News November 30, 2024
విజయనగరం నుంచి గుంటూరు- రాయగడ ఎక్స్‌ప్రెస్
కోమటిపల్లి స్టేషన్‌లో అభివృద్ధి పనుల దృష్ట్యా డిసెంబర్ 4వ తేదీ వరకు గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ రైలు విజయనగరం జంక్షన్ నుంచి రాకపోకలు సాగిస్తుందని వాల్తేర్ డీసీఎం సందీప్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ట్రైన్ నంబర్ 17243 /44 గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ ద్వారా రాకపోకలు సాగించే ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని కోరారు.
News November 30, 2024
హోం మంత్రి ఆధ్వర్యంలో సమీక్ష: కలెక్టర్
జిల్లా సమీక్షా సమావేశం శనివారం జరుగుతుందని కలెక్టర్ అంబేద్కర్ ఒక తెలిపారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొని జిల్లా అభివృద్ధిపై చర్చిస్తారన్నారు.
News November 29, 2024
విశాఖ డెయిరీపై విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీ
విశాఖ డెయిరీపై విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నియమించారు. కమిటీ ఛైర్మన్‌గా జ్యోతుల నెహ్రూ, సభ్యులుగా బొండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్‌విఎస్ కేకే.రంగారావు, దాట్ల సుబ్బరాజులను నియమించారు. సమగ్ర విచారణ జరిపి రెండు నెలల లోపు నివేదిక సమర్పించాలని స్పీకర్ ఆదేశించారు.