News February 27, 2026
VZM: భార్య మందలించడంతో భర్త ఆత్మహత్య

విజయనగరం మండలం కోరుకొండపాలెంకు చెందిన వెంకటసత్యం అనే వ్యక్తి మద్యానికి బానిసైయ్యారు. ఈ క్రమంలో నిత్యం తాగితే పాప, తాను బతకడం ఎలా అంటూ భార్య నిలదీయడంతో మనస్తాపానికి గురైయ్యాడు. దీంతో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 1, 2026
రెబ్బెన: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య (UPDATE)

రెబ్బెన మండలం రాజారాం గ్రామానికి చెందిన పూదరి కిరణ్(32) సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. కిరణ్- సరిత దంపతులకు 12 ఏళ్ల కుమార్తె ఉంది. కాగా కిరణ్ తాగి వచ్చి భార్యతో తరచూ గొడవపడేవాడు. దీంతో ఆమె మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కిరణ్.. శనివారం రాత్రి ఇంట్లో ఊరేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 1, 2026
కేసులు పరిష్కరించే మధ్యవర్తులకు రూ.10,000: CBN

AP: అమరావతిలో నేషనల్ జుడీషియల్ అకాడమీని నెలకొల్పాలని CM చంద్రబాబు CJIని కోరారు. ’మధ్యవర్తిత్వం‘పై జరిగిన సదస్సులో మాట్లాడుతూ ‘ఇక్కడ నిర్మించే జస్టిస్ సిటీని దేశంలోనే బెస్ట్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం. మధ్యవర్తిత్వంతో కేసులను పరిష్కరిస్తే ₹10,000 ఇస్తాం. కేసులు పరిష్కారం కాకున్నా ₹3000 ఇస్తాం’ అని పేర్కొన్నారు. అంతకు ముందు జడ్జీల బంగ్లాలను CJI ప్రారంభించారు. AP జుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేశారు.
News March 1, 2026
BREAKING: US యుద్ధనౌకపై 4 మిస్సైళ్లతో ఇరాన్ దాడి

యుద్ధ విమానాలను తరలిస్తున్న అమెరికా నౌక అబ్రహం లింకన్‌పై ఇరాన్ దాడి చేసింది. 4 బాలిస్టిక్ మిస్సైళ్లతో అటాక్ చేసినట్లు IRGC ప్రకటించింది. అయితే యుద్ధ విమానాలకు ఏ మేరకు నష్టం జరిగిందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. యుద్ధం నేపథ్యంలో ఇరాన్ చుట్టుపక్కల ఉన్న ఎయిర్ బేస్‌లకు వాటిని తరలిస్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా ఇరాన్‌పై US దాడులు మరింతగా పెంచే ఆస్కారముంది.


