News September 4, 2025
VZM: ‘మధ్యవర్తిత్వ కార్యక్రమానికి విశేష స్పందన’

విజయనగరం జిల్లాలో నిర్వహించిన మధ్యవర్తిత్వ కార్యక్రమానికి భారీగా విశేష స్పందన లభించిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భబిత గురువారం తెలిపారు. 3 నెలలుగా జిల్లా కోర్టులో ఉన్న మధ్యవర్తిత్వ కేంద్రానికి 1,100 కేసులు మధ్యవర్తిత్వ ప్రక్రియకు పంపించగా అందులో 30 కేసులు పరిష్కరించబడ్డాయన్నారు. మనోవర్తి, ప్రమాద బీమా, గృహహింస, చెక్ బౌన్స్ కేసులు, వాణిజ్యపరమైన తగాదాలు పరిష్కరించుకోవచ్చన్నారు.
Similar News
News September 7, 2025
పైడిమాంబ ఆలయంలో నేడు దర్శనాలు నిలిపివేత

ఉత్తరాంధ్ర భక్తుల కల్పవల్లి శ్రీ పైడిమాంబ ఆలయంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఆలయాన్ని మూసివేస్తున్నామని.. తిరిగి సోమవారం ఉదయం మహా సంప్రోక్షణ కార్యక్రమం జరిపించి దర్శనాలు కల్పిస్తామన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News September 7, 2025
సోషల్ మీడియాలో ప్రచారం అవాస్తవం: VZM కలెక్టర్

జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్ అంబేడ్కర్ శనివారం మరోసారి ప్రకటించారు. రాజాంలోని నందిని ట్రేడర్స్‌కు ఈనెల 4న 24 టన్నుల యూరియా సరఫరా చేశామని, తగినంత స్టాకు ఉందన్నారు. షాపు దగ్గర నిలుచున్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన చిన్నపాటి ఘర్షణే గొడవకు కారణమన్నారు. దీనికి ఎరువుల సరఫరాతో సంబంధం లేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. అవసరమైనంత ఎరువులను సరఫరా చేస్తున్నామన్నారు.
News September 7, 2025
దావోస్ పర్యటనలో మంత్రి కొండపల్లి బిజీ బిజీ

దావోస్ పర్యటనలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బిజీ బిజీగా గడుపుతున్నారు. SME రంగం అభివృద్ధి చెందాలంటే ఎలాంటి పరిస్థితులు ఉండాలి, ఎటువంటి ప్రోత్సాహకాలు అవసరం అనే అంశంపై గ్లోబల్ SME సమ్మిట్ -2025లో శనివారం ప్రసంగించారు. SMEల అభివృద్ధికి నూతన టెక్నాలజీతో పాటు, యూనివర్శిటీల నుంచే స్టార్టప్‌లను ప్రోత్సహించడం, పరిశోధన-అభివృద్ధి విభాగాల్లో వాటిని మరింత బలోపేతం చేయడం, తదితర అంశాలపై చర్చించారు.