News February 5, 2025
VZM: మరికొన్ని రోజుల్లో ‘రూట్’ క్లియర్..!

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని దీర్ఘకాలిక సమస్యగా ఉన్న పెదమానాపురం ఫ్లైఓవర్ పనులు ఊపందుకున్నాయి. గత కొంత కాలంగా నత్తనడకగా సాగిన పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రత్యేక దృష్టి పెట్టడంతో పనుల వేగం పుంజుకున్నాయి. మరో రెండు నెలల్లో బ్రిడ్జి పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు.
Similar News
News February 20, 2026
క్వాంటం కంప్యూటింగ్‌లో APదే పైచేయి.. AI సమ్మిట్‌లో చంద్రబాబు

AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొన్న AP CM చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం త్వరలోనే గూగుల్ వంటి సంస్థల రాకతో గ్లోబల్ AI డేటా హబ్‌గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో నిర్మిస్తున్న క్వాంటం వ్యాలీ గురించి ప్రపంచమంతా మాట్లాడుకునే రోజు వస్తుందన్నారు. ప్రపంచానికి అవసరమైన క్వాంటం కంప్యూటింగ్ పరికరాలను APలోనే తయారు చేసేలా ఎకోసిస్టమ్‌ను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
News February 20, 2026
కొన్నాళ్లు వేరుకాపురం ఉండటం మంచిదే..

పెళ్లైన తర్వాత కొన్నాళ్లు వేరుకాపురం ఉండటం మంచిదే అంటున్నారు నిపుణులు. దీనివల్ల బంధం దృఢమవ్వడంతో పాటు బాధ్యతలు తెలుస్తాయంటున్నారు. అలాగే ప్రస్తుతం దంపతులిద్దరూ ఉద్యోగం చేస్తుండటంతో కలిసి గడిపే సమయం తగ్గిపోయింది. అదే విడిగా ఉంటే కాస్త సమయమైనా దొరుకుతుందంటున్నారు. అత్తమామలతో అనుబంధం దృఢమయ్యే దాకా విడిగా ఉంటూనే సందర్భం వచ్చినప్పుడు వారితో సమయం గడపాలని సూచిస్తున్నారు.
News February 20, 2026
ఇల్లు తుడిచే నీళ్లలో ఉప్పు ఎందుకు వేయాలి?

ఇల్లు తుడిచే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు కలిపితే ఇంట్లోని ప్రతికూల తరంగాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు. ‘ఉప్పులోని రసాయన గుణాలు సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి. వాస్తు పరంగా ఇది ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మార్చి, దారిద్ర్యాన్ని పోగొడుతుంది. తద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వీలైతే ప్రతిరోజు లేదా కనీసం మంగళ, శుక్రవారాల్లో ఇలా చేయాలి. తద్వారా ఇంట్లో ప్రశాంతత, సంతోషం నెలకొంటాయి’ అంటున్నారు.


