News September 9, 2025
VZM: మరో ఇద్దరు టీడీపీ నేతలకు నామినేటెడ్ పదవులు

కూటమి ప్రభుత్వం నాలుగు కార్పొరేషన్లకు సంబంధించి 51 మంది డైరెక్టర్లను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా విజయనగరం జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. విజయనగరం నియోజకవర్గం నుంచి కెల్ల అప్పలనాయుడు(టీడీపీ), గజపతినగరం నుంచి బండారు సాయి లక్ష్మి (టీడీపీ)కి అవకాశం ఇచ్చింది.
Similar News
News September 9, 2025
ఎస్.కోట: ట్రాక్టర్ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

ఎస్.కోటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం ఇసుక లోడుతో వెళుతున్న ట్రాక్టర్ స్థానిక వన్ వే రోడ్డుపై నడిచి వెళుతున్న వల్లయ్యను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ నారాయణమూర్తి ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
News September 9, 2025
విజయనగరంలో డయల్ యువర్ ఆర్టీసీ డీపీటీవో

డయల్ యువర్ డీపీటీవో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు విజయనగరం ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ప్రయాణికులు తమ సూచనలు, సలహాలు, ఇబ్బందులను 99592 25604 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు.
News September 9, 2025
VZM: జిల్లాలో 5వేల ఎకరాల్లో IT పార్కుల ఏర్పాటు

IT పార్కుల స్థాపనకు సుమారు 5వేల ఎకరాల భూమిని సేకరించనున్నట్లు కలెక్టర్ అంబేద్కర్ సోమవారం ప్రకటించారు. త్వరలోనే భూసేకరణ ప్రారంభిస్తామన్నారు. ఇప్పటికే భోగాపురం జాతీయ రహదారికిరువైపులా 200 మీటర్ల పరిధిలో సుమారు 754 ఎకరాలను గుర్తించామన్నారు. వీటిలో 20 ఎకరాలకు పైబడిన స్థలాలను గుర్తించామన్నారు. వీటిలో 100 ఎకరాలు పైబడిన 3 బ్లాకులు ఉన్నాయన్నారు. స్థలాలు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు.