News November 23, 2024

VZM: మహిళ ఎమ్మెల్యేలతో హోంమంత్రి సెల్ఫీ

image

ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంతో ముగియడంతో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన మహిళా ఎమ్మెల్యేలు శుక్రవారం సందడి చేశారు. మహిళా ఎమ్మెల్యేలందరూ ఓ చోట చేరి సరదాగా గడిపారు. రాష్ట్ర హోంమంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనిత సెల్ఫీ తీయగా.. ఆమెతో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఫోటో దిగారు.

Similar News

News February 10, 2026

గిరిజన వర్శిటీని సందర్శించిన ఉత్తరాఖండ్ మీడియా బృందం

image

ఉత్తరాఖండ్‌కు చెందిన మీడియా ప్రతినిధులు విజయనగరం కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు-విశ్వవిద్యాలయ అధికారుల మధ్య పరస్పర చర్చ జరిగింది. విశ్వవిద్యాలయ అకాడమిక్, పరిశోధన, గిరిజన అభివృద్ధి కార్యక్రమాలపై రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా, ఇన్‌ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ టి. శ్రీనివాసన్ వివరించారు.

News February 10, 2026

గజపతినగరం: అగ్ని ప్రమాదం.. చికిత్స పొందుతూ మృతి

image

గజపతినగరం మండలం కొత్త బగ్గాం గ్రామానికి చెందిన బగ్గాం శ్యామల (75) జనవరి 25న తన ఇంటి వరండాలో తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తుండగా ప్రమాదవశాత్తు చీర అంచుకు దీపం అంటుకుని తీవ్రంగా గాయపడింది. నడుము వెనుక భాగాన, ఎడమ కాలు తొడ మీద కాలి పోవడంతో విజయనగరం గవర్నమెంట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయినట్లు ఎస్‌ఐ కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు.

News February 10, 2026

VZM: గృహనిర్మాణాలపై కలెక్టర్ అసంతృప్తి

image

జిల్లా వ్యాప్తంగా గృహ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. గృహ నిర్మాణ ప్రగతిపై ఆయన విజయనగరం కలెక్టరేట్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ రెండు వారాల్లో గ్రామీణ ప్రాంతంలో సుమారు 1374, పట్టణ ప్రాంతాల్లో 650 ఇల్లు స్టేజ్ కన్వర్షన్ చేయాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికి, పెద్దగా ప్రగతి కనిపించలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు.