News May 11, 2024
VZM: మీ నియోజకవర్గంలో విజయం ఎవరిది?

ఎన్నికల సంగ్రామంలో ప్రచార ఘట్టం నేటితో ముగిసింది. నాయకులు కొద్దిరోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల మద్దతును కూడగట్టుకున్నారు. ప్రచారంలో విమర్శలు, హామీలతో తమదైన రీతిలో ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థుల కుటుంబీకులు సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఓటర్లు ఎవరికి మొగ్గుచూపుతారో వేచి చూడాల్సి ఉంది. మరి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.
Similar News
News April 22, 2025
పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు: VZM SP

బొబ్బిలి PSలో 2024లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు మోహన్‌కు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2వేల జరిమానాను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం తెలిపారు. పార్వతీపురం ఏకలవ్య స్కూల్లో చదువుతున్న బాలికకు తన మామయ్య ఫోన్ ఫే ద్వారా నగదు మోహన్‌కు పంపారని, డబ్బులు తీసుకొనేందుకు బాలిక బొబ్బిలికి రాగా రూమ్‌కి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడన్నారు. నేరం రుజువు కాగా శిక్ష ఖరారైందన్నారు.
News April 22, 2025
VZM: డోనర్ అవసరం లేదు.. నేరుగా రండి..!

తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్తులు రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకు నుంచి ఉచితంగా రక్తాన్ని పొందచ్చని రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ ప్రసాదరావు సోమవారం తెలిపారు. రక్తం అవసరమైతే కంటోన్మెంట్ సమీపంలోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకును సంప్రదించి అవసరమైన గ్రూపు రక్తాన్ని పొందవచ్చన్నారు. డోనర్ అవసరం లేదని, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన పనిలేదన్నారు.
News April 22, 2025
VZM: మంత్రి నిమ్మల జిల్లా పర్యటన షెడ్యూల్ ఇలా

జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు విజయనగరం జిల్లాలో మంగళవారం పర్యటించనున్నారు. ఉదయం 4.30 గంటలకు మంత్రి జిల్లాకు చేరుకుంటారు. ఉదయం 8.30 గంటలకు గుర్ల మండలంలో తారకరామ తీర్ధసాగర్ రిజర్వాయర్ బ్యారేజ్ పనులను పరిశీలిస్తారు. అక్కడి నుంచి 9.30కు బయలుదేరి, కుమిలి వద్ద నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్ పనులను పరిశీలిస్తారు. అనంతరం కలక్టరేట్‌కు చేరుకొని సమీక్షిస్తారు.