News November 11, 2024
VZM: ‘యువ న్యాయవాదులదే ఆ బాధ్యత’
రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ లేని విధంగా విజయనగరం జిల్లా కోర్టుకు ఆధునిక వసతులతో కూడిన నూతన భవన సమూహం మంజూరయ్యాయని హైకోర్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో కృతజ్ఞతా పూర్వక అభినందన సభ నిర్వహించారు. ముఖ్యంగా యువ న్యాయవాదులే ఈ భవనాల్లో న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్ చేయనున్నందున వారిపైనే భవనాల నిర్మాణం, నిర్వహణ బాధ్యత అధికంగా ఉంటుందన్నారు.
Similar News
News November 21, 2024
VZM: రామతీర్థం అభివృద్ధికి ప్రతిపాదనలు ఇవే..
జిల్లాలో ఉన్న రామతీర్థం దేవస్థానాన్ని తీర్థయాత్ర పర్యాటక స్థలంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ ఇటీవల సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రామతీర్థంలో మ్యూజియం, కేఫ్ టేరియా, వ్యూ పాయింట్లు, రోప్‌వే నిర్మాణం, లైటింగ్, బౌద్ధ ప్రదేశాల వద్ద వసతులు, కోనేరు రహదారి విస్తరణ వంటి పనులకు అధికారులు త్వరలో ప్రతిపాదనలు తయారు చేయనున్నారు.
News November 21, 2024
భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి పేరు ప్రతిపాదన
జిల్లాలో ఏర్పాటవుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును కూటమి ప్రభుత్వం ప్రతిపాదించింది. విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరును పెడుతున్నట్లు ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా అల్లూరి సేవలను గుర్తు చేసుకున్నారు.
News November 21, 2024
5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యం: లోకేశ్
5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నట్లు మంత్రి లోకేశ్ అసెంబ్లీలో తెలిపారు. ఈ లక్ష్యం చేరుకోవాలంటే 164 మంది ఎన్డీఏ ఎమ్మెల్యేలు సహకరించాలని కోరారు. విశాఖ ఐటీ హిల్స్‌పై రాబోయే 3 నెలల్లో రెండు ఐటీ కంపెనీలతో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. నిక్సీతో పాటు సింగపూర్ నుంచి సీ లైనింగ్ కేబుల్‌ను విశాఖకు తీసుకొచ్చే బాధ్యతను వ్యక్తిగతంగా తీసుకుంటున్నట్లు వెల్లడించారు.