News October 12, 2025
VZM: ‘రాష్ట్ర స్థాయిలో ఇంజినీర్ల సమస్యల పరిష్కారమే లక్ష్యం’

పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ భవనంలో జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహంతి ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకంలో ఇంజినీర్ల పాత్ర, సిబ్బంది సర్వీస్ రూల్స్, ప్రమోషన్లు, బదిలీలు, సేవా పరిరక్షణ వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర స్థాయిలో ఇంజినీర్ల సమస్యలను పరిష్కరించడమే అసోసియేషన్ ప్రధాన లక్ష్యమని మహంతి పేర్కొన్నారు.
Similar News
News October 12, 2025
VZM: 14న తెప్పోత్సవం.. రేపు ట్రయిల్ రన్..!

ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు విజయనగరం పైడిమాంబ సిరిమానోత్సవం పురస్కరించుకొని తెప్పోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఈనెల 14న సాయంత్రం పట్టణంలోని పెద్ద చెరువులో తెప్పోత్సవం కనులపండువగా జరగనుంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటలకు పెద్ద చెరువులో తెప్పోత్సవ ట్రయిల్ రన్ నిర్వహించనున్నట్లు దేవస్థాన వర్గాలు వెల్లడించాయి.
News October 12, 2025
VZM: వ్యాపార కేంద్రాలుగా సెల్లార్లు..!

విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని కమర్షియల్ కాంప్లెక్స్‌లు, హాస్పిటల్స్‌లో సెల్లర్లను వాహనాల పార్కింగ్ చేసేందుకు వినియోగించకుండా వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్నారు. కొంతమంది వాటిని అద్దెలకిచ్చి యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. చివరికి సెల్లార్లు లేక వాహనదారులు రోడ్లపై నిలుపుతుండటంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోంది. MG రోడ్డు, మూడు లాంతర్లు, RTC కాంప్లెక్స్ వద్ద ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది.
News October 12, 2025
VZM: ‘జీఎస్టీ చెల్లింపులపై అవగాహన కల్పించడమే ఎగ్జిబిషన్ లక్ష్యం’

జీఎస్టీ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ సేల్స్‌కు విశేష స్పందన లభించిందని జీఎస్టీ జాయింట్ కమిషనర్ నిర్మల జ్యోతి తెలిపారు. స్థానిక సంగీత కళాశాలలో ప్రదర్శనను శనివారం సందర్శించారు. తక్కువ ధరలకు నాణ్యమైన ఉత్పత్తులు కొనుగోలు చేసి సుమారు రూ.25 వేలు వరకు ప్రజలు లబ్ధి పొందారని చెప్పారు. జీఎస్టీ చెల్లింపులపై అవగాహన పెంచడమే ఈ ఎగ్జిబిషన్ లక్ష్యమని పేర్కొన్నారు.