News October 12, 2025

VZM: రూ.100 కోసం గొడవ.. వ్యక్తి మృతి

image

కొత్తవలసలో ఈనెల 7న రూ.100 కోసం ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ మరణానికి దారితీసింది. మంగళవీధికి చెందిన జే. ప్రసాద్(32) నుంచి మద్యం మత్తులో అదే వీధికి చెందిన ఎస్.రవితేజ రూ.100 లాక్కొని చికెన్ కొన్నాడు. చికెన్ లాక్కున్నాడని కూరగాయల కత్తితో ప్రసాద్ దవడపై రవితేజ పొడిచాడు. KGHలో చికిత్స పొందుతూ ప్రసాదు శనివారం మృతి చెందాడు. హత్యా నేరం కింద రవితేజను పోలీసులు అరెస్టు చేశారు.

Similar News

News October 12, 2025

NZB: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

నిజామాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్ఐ హరిబాబు ఆదివారం తెలిపారు. ప్రశాంత్, సందీప్ శనివారం రాత్రి బైక్‌పై శివాజీ చౌక్ నుంచి దుబ్బా వైపు వెళ్తుండగా.. కృష్ణ మందిరం వద్ద సైకిల్‌ను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ప్రశాంత్, సందీప్ గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా ప్రశాంత్ మృతి చెందారు.

News October 12, 2025

ఆదిలాబాద్: డీసీసీ పీఠం కోసం పోటీ

image

ఆదిలాబాద్ డీసీసీ పీఠం కోసం జిల్లా నేతలు పోటీ పడుతున్నారు. స్థానిక ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం డీసీసీలపై దృష్టి సారించింది. ఆదిలాబాద్ నుంచి డీసీసీ రేసులో గండ్రత్ సుజాత, గోక గణేష్ రెడ్డి, కంది శ్రీనివాస్ రెడ్డి, ఆడే గజేందర్, అడ్డి బోజారెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరీ అధిష్టానం ఎవరికి పీఠం కట్ట బెడుతుందో చూడాలి.

News October 12, 2025

పున్నమి ఘాట్‌లో గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్

image

GST 2.0 సంస్కరణలతో ప్రజలకు జరుగుతున్న ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశా వివరించారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 13 నుంచి 19వ తేదీ వరకు ఇబ్రహీంపట్నంలోని పున్నమి ఘాట్‌లో గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. వ్యాపారులు, హస్త కళాకారులు వస్తు విక్రయాలు చేస్తారన్నారు.