News December 14, 2025
VZM: రెచ్చిపోయిన దొంగలు.. ఒకేసారి 5 ఆలయాల్లో చోరీ

వేపాడ మండలం బానాదిలో శనివారం రాత్రి 5 దేవాలయాల్లోని హుండీలో సొమ్మును దొంగలు అపహరించినట్లు SI సుదర్శన్ తెలిపారు. శివాలయం, వినాయకుడు, హనుమాన్, పరదేశమ్మ, మరిడిమాంబ ఆలయాల్లో హుండీలను పగలగొట్టి సొమ్ము దొంగలించినట్లు వెల్లడించారు. దొంగలించిన సోమ్ము సుమారు రూ.41 వేలు ఉంటుందన్నారు. క్లూస్ టీమ్‌తో తనిఖీలు నిర్వహించారు. అర్చకుడు కిషోర్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI పేర్కొన్నారు.
Similar News
News December 25, 2025
పిట్ ఎన్డీపీఎస్ చట్టం ఎప్పుడు ప్రయోగిస్తారంటే?

➤గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి నేరాలను ముందస్తుగా అడ్డుకోవడానికి తీసుకొచ్చిన కఠిన చట్టం.
➤నిందితుడిని కోర్టు విచారణ లేకుండానే ముందస్తు నిర్బంధం చేయవచ్చు.
➤సమాజానికి ప్రమాదంగా మారిన వారిపై మాత్రమే ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు.
➤గరిష్ఠంగా ఏడాది వరకు జైలులో నిర్బంధం చేయవచ్చు.
➤శాంతిభద్రతలు, ప్రజా భద్రతకు ముప్పు ఉంటే ప్రభుత్వం ఈ చట్టం అమలు చేస్తుంది.
News December 25, 2025
గంజాయి కేసుల్లో నిందితుడిపై పిట్ NDPS యాక్ట్: VZM SP

పలు గంజాయి కేసుల్లో నిందితుడిగా ఉన్న పఠాన్ బాషా అలీ (31)పై కఠినమైన పిట్ ఎన్‌డిపిఎస్ చట్టం ప్రయోగించినట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ గురువారం తెలిపారు. గత నాలుగు సంవత్సరాల్లో 4 గంజాయి కేసుల్లో అరెస్టు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్భంద ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. నిందితుడిపై ఇప్పటికే సస్పెక్ట్ షీట్ ఉందని, గురువారం అతడిని నిర్భందించి విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించినట్లు వెల్లడించారు.
News December 25, 2025
42 మందితో విజయనగరం టీడీపీ పార్లమెంటరీ వర్గం

విజయనగరం జిల్లా పార్లమెంటరీ కార్యవర్గాన్ని టీడీపీ ప్రకటించింన సంగతి తెలిసిందే. ఇందులో 42 మందికి స్థానం కల్పించింది. ఇందులో తొమ్మిది మంది చొప్పున ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, అధికార ప్రతినిధులను, కార్యదర్శులకు అవకాశమిచ్చింది. మొత్తంగా 13 మంది మహిళలకు స్థానం లభించింది. కాగా నూతన కార్యవర్గంలో బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చారని పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు.


