News October 28, 2025
VZM: రేపటి జడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా

మొంథా తుఫాన్ నేపథ్యంలో బుధవారం జరగాల్సిన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా పరిషత్ సీఈవో బి. సత్యనారాయణ మంగళవారం తెలిపారు. తదుపరి సమావేశ తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. సభ్యులు, అధికారులు దీనిని గమనించాలని సూచించారు.
Similar News
News October 28, 2025
KNR: సీసీఎస్ PS నూతన కార్యాలయం ప్రారంభం

సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని సీపీ గౌష్ ఆలం ప్రారంభించారు. గతంలో కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ భవనంపైన పనిచేసిన సీసీఎస్ పోలీస్ స్టేషన్‌ను కరీంనగర్ రూరల్ ఏసీపీ కార్యాలయ కాంపౌండ్‌లో నిర్మించిన నూతన భవనంలోకి తరలించారు. నూతన భవనం ద్వారా సీసీఎస్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి మెరుగైన వాతావరణం లభిస్తుందని, వారు మరింత సమర్థవంతంగా సేవలు అందించగలరని సీపీ ఆశాభావం వ్యక్తం చేశారు.
News October 28, 2025
మిర్యాలగూడ: లక్కీ డ్రాలో మృతుడికి అవకాశం

మద్యం టెండర్ల లక్కీడ్రాలో ఓ మృతుడికి అవకాశం దక్కింది. ఈ ఘటన నల్గొండలో చోటుచేసుకుంది. MLGలోని మద్యం షాపు(63)నకు గోపులాపురం గ్రామానికి చెందిన కాసాని అశోక్(38) ఈనెల18న టెండరు దరఖాస్తు సమర్పించి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అతను చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. నిబంధనల ప్రకారం మృతుడి కుటుంబ సభ్యుల్లో ఒకరికి దుకాణం కేటాయించనున్నట్లు తెలిసింది.
News October 28, 2025
విశాఖ: తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగా రేషన్

విశాఖ జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ముందస్తుగా అంటే మంగళవారం నుంచి రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు. అధికారుల ఆదేశాల మేరకు నవంబర్ నెలకు సంబంధించిన రేషన్ సరుకులు ముందస్తుగానే అందజేస్తున్నారు. ఇప్పటికే పాత డెయిరీ ఫారం ఆదర్శనగర్ ప్రాంతాల్లో రేషన్ డీలర్లు సరుకులు పంపిణీ చేస్తున్నారు. స్టాక్ అంతా ఇప్పటికే రేషన్ షాపులకు చేరుకుంది.


