News August 22, 2025
VZM: రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

విజయనగరం జిల్లాలో ఎరువులకు కొరత లేదని, సరిపడి నంత స్టాక్ సిద్దంగా ఉందని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. శుక్రవారం తన ఛాంబర్‌లో సమీక్ష జరిపారు. ప్రస్తుతం ఉన్నవివిధ పంటలకు గాను 36,740 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటివరకు 25,605 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగిందని చెప్పారు. 3వేల టన్నుల యూరియా అవసరం ఉంటుందన్నారు.
Similar News
News August 22, 2025
VZM: గుంటూరు పార్లమెంట్ పరిశీలకునిగా కిమిడి నాగార్జున

పార్లమెంటు అధ్యక్షుల నియామకంలో భాగంగా తనను గుంటూరు పార్లమెంట్ స్థానానికి పరిశీలకులుగా నియమించినట్లు విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక పత్రిక విడుదల చేశారు. తనపై నమ్మకం పెట్టి పరిశీలకునిగా నియమించినందుకు సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌కి ధన్యవాదాలు తెలియజేశారు. దీంతో నాగార్జునకి పలువురు అభినందనలు తెలిపారు.
News August 22, 2025
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు: ఎస్పీ

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో వివిధ హోదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీసు కార్యాలయంలో శుక్రవారం “పోలీసు వెల్ఫేర్ డే” నిర్వహించారు. ఈసందర్భంగా సిబ్బంది వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను తెలుసుకున్నారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
News August 22, 2025
VZM: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ VRO

వేపాడ మండలం సింగరాయ VROగా పని చేస్తున్న కే.సత్యవతి ఏసీబీ వలలో చిక్కింది. విజయనగరం DSP రమ్య అందించిన వివరాల ప్రకారం.. రెవెన్యూ భూములకు ఓ రైతు ముటేషన్‌కు దరఖాస్తు చేసుకోగా VRO రూ.1.70 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో గురువారం సాయంత్రం రైతు వేపాడ కల్లాల వద్ద రూ.లక్ష VROకి ఇస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు. MRO కార్యాలయంలో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.