News December 19, 2025

VZM: రైతుల ఖాతాల్లో రూ.373 కోట్ల జమ

image

ఖరీఫ్ 2025-26లో జిల్లాలో 359 RSKల ద్వారా 37,800 రైతుల నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ.373 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా మేనేజర్ బి.శాంతి శుక్రవారం తెలిపారు. అదనపు కిలోలు డిమాండ్ చేసిన పలు రైస్ మిల్లులకు నోటీసులు జారీ చేసి, తూకంలో మోసాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా అమలు చేస్తున్నామన్నారు.

Similar News

News December 24, 2025

ఉద్యాన సాగు విస్తరణకు జిల్లాలో కొత్త ప్రణాళికలు: కలెక్టర్

image

ఉద్యాన పంటల విస్తరణ దిశగా జిల్లా కొత్త అడుగులు వేస్తోంది. జిల్లాలో కొత్తగా 10 వేల ఎకరాల్లో ఉద్యాన సాగుకు విజయనగరం కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ప్రణాళికలు రూపొందించారు. రబీ సీజన్‌లో 4,000 ఎకరాలు, ఖరీఫ్‌లో 6,000 ఎకరాలు అదనంగా సాగులోకి తేవాలని ప్రతిపాదించారు. ఈ అంశాలపై బుధవారం డీఆర్డీఏ, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

News December 24, 2025

అభివృద్ధి ప్రాజెక్టుల భూసేకరణను పూర్తి చేయాలి: VZM కలెక్టర్

image

జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల భూసేకరణను పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, జాతీయ రహదారి–516(B), రైల్వే లైన్ల విస్తరణ, ఐటీ పార్కులు, స్టీల్ ప్లాంట్, తదితర ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై సమీక్షించారు. గిరిజన విశ్వవిద్యాలయం వద్ద విద్యుత్ లైన్లు వెంటనే తొలగించాలని ఆదేశించారు.