News April 20, 2025
VZM: రౌడీ షీటర్లకు ఎస్పీ హెచ్చరిక

రౌడీ షీటర్లు సన్మార్గంలో జీవించకుంటే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని SP వకుల్ జిందల్ హెచ్చరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో తమ సిబ్బంది రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారన్నారు. రౌడీ షీట్లు కలిగిన వ్యక్తుల ప్రవర్తన, వారు నిర్వర్తించే పనులు, ప్రస్తుత వారి జీవన విధానం పట్ల నిఘా పెట్టాలని ఆదేశించారు. B,C షీట్లు కలిగిన వ్యక్తులకు లేటెస్ట్ ఫోటోలు తీయాలన్నారు.
Similar News
News April 20, 2025
VZM: మహిళ దారుణ హత్య

విజయనగరం జిల్లాకు చెందిన మహిళ రణస్థలంలో దారుణ హత్యకు గురైంది. పూసపాటిరేగ మం. పెద్ద పతివాడకి చెందిన భవాని (26) భర్తతో కలిసి పైడిభీమవరం పంచాయతీ గొల్లలపేటలో ఉంటోంది. పైడిభీమవరంలోని ఓ హోటల్లో పని చేస్తున్న భవాని శనివారం సాయంత్రం ఇంటికి వస్తుండగా చాక్‌తో దుండగులు దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన భవాని అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News April 20, 2025
DSC: ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఖాళీలు ఎన్నంటే?

రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ 10 గంటలకు మెగా DSC నోటిఫికేషన్ వెలువడనుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ➱SA LANG-1: 14, ➱HINDI: 14, ➱ENG: 23, ➱MATHS: 08, ➱PS: 32, ➱BS: 20, ➱SOCIAL: 62, ➱PE:63, ➱SGT: 210, ➱TOTAL: 446 ఉన్నాయి. అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు సంబంధించి ➱ENG:07, ➱MATHS:25, ➱PS:24, ➱BS:16, ➱SOCIAL:05, ➱SGT: 60, ➱TOTAL:137 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
News April 20, 2025
మామిడి రైతులకు అన్ని విధాల సహకారం అందిస్తాం: మంత్రి

జిల్లాలో మామిడి పండించే రైతులకు అన్ని విధాలా సహకారం అందిస్తామని, వారు ఎదగడానికి ఏ రకమైన సహకారం కావాలో తెలియజేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శనివారం విజయనగరంలోని ఓ హోటల్‌లో రైతులతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. రైతులు పంటను పరిరక్షించుకోడానికి కావలసిన సాంకేతికతను కూడా తెలుసుకోవాలని, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పద్ధతులను కూడా తెలుసుకోవాలని తెలిపారు.