News May 11, 2024

VZM: ర్యాండ‌మైజేష‌న్ ద్వారా ఎన్నికల సిబ్బంది కేటాయింపు

image

ర్యాండ‌మైజేష‌న్ ద్వారా పోలింగ్ కేంద్రాల‌కు ఎన్నికల సిబ్బందిని కేటాయించారు. జిల్లా ఎన్నిక‌ల సాధార‌ణ‌ ప‌రిశీల‌కులు హ‌నీష్ చాబ్రా, త‌లాత్ ప‌ర్వేజ్ ఇక్బాల్ రోహెల్లా, సీతారామ్ జాట్ స‌మ‌క్షంలో జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ నాగ‌ల‌క్ష్మి క‌లెక్ట‌రేట్ ఎన్ఐసీ కేంద్రంలో శనివారం ఈ ప్ర‌క్రియ నిర్వ‌హించారు.

Similar News

News April 22, 2025

పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు: VZM SP

image

బొబ్బిలి PSలో 2024లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు మోహన్‌కు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2వేల జరిమానాను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం తెలిపారు. పార్వతీపురం ఏకలవ్య స్కూల్లో చదువుతున్న బాలికకు తన మామయ్య ఫోన్ ఫే ద్వారా నగదు మోహన్‌కు పంపారని, డబ్బులు తీసుకొనేందుకు బాలిక బొబ్బిలికి రాగా రూమ్‌కి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడన్నారు. నేరం రుజువు కాగా శిక్ష ఖరారైందన్నారు.

News April 22, 2025

VZM: డోనర్ అవసరం లేదు.. నేరుగా రండి..!

image

తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిగ్ర‌స్తులు రెడ్‌క్రాస్ బ్ల‌డ్ బ్యాంకు నుంచి ఉచితంగా ర‌క్తాన్ని పొంద‌చ్చని రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మ‌న్ ప్ర‌సాద‌రావు సోమవారం తెలిపారు. ర‌క్తం అవ‌స‌ర‌మైతే కంటోన్మెంట్ స‌మీపంలోని రెడ్ క్రాస్ బ్ల‌డ్ బ్యాంకును సంప్ర‌దించి అవ‌స‌ర‌మైన గ్రూపు ర‌క్తాన్ని పొంద‌వ‌చ్చన్నారు. డోన‌ర్ అవ‌స‌రం లేద‌ని, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన పనిలేదన్నారు.

News April 22, 2025

VZM: మంత్రి నిమ్మల జిల్లా పర్యటన షెడ్యూల్ ఇలా

image

జ‌ల‌వ‌న‌రుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు విజయనగరం జిల్లాలో మంగళవారం పర్యటించనున్నారు. ఉద‌యం 4.30 గంట‌ల‌కు మంత్రి జిల్లాకు చేరుకుంటారు. ఉద‌యం 8.30 గంట‌ల‌కు గుర్ల మండ‌లంలో తార‌క‌రామ తీర్ధ‌సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ బ్యారేజ్‌ ప‌నుల‌ను ప‌రిశీలిస్తారు. అక్క‌డి నుంచి 9.30కు బ‌య‌లుదేరి, కుమిలి వ‌ద్ద నిర్మాణంలో ఉన్న రిజ‌ర్వాయ‌ర్ ప‌నుల‌ను ప‌రిశీలిస్తారు. అనంతరం క‌ల‌క్ట‌రేట్‌కు చేరుకొని సమీక్షిస్తారు.

error: Content is protected !!