News August 22, 2025
VZM: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ VRO

వేపాడ మండలం సింగరాయ VROగా పని చేస్తున్న కే.సత్యవతి ఏసీబీ వలలో చిక్కింది. విజయనగరం DSP రమ్య అందించిన వివరాల ప్రకారం.. రెవెన్యూ భూములకు ఓ రైతు ముటేషన్‌కు దరఖాస్తు చేసుకోగా VRO రూ.1.70 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో గురువారం సాయంత్రం రైతు వేపాడ కల్లాల వద్ద రూ.లక్ష VROకి ఇస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు. MRO కార్యాలయంలో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.
Similar News
News August 22, 2025
పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు: ఎస్పీ

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో వివిధ హోదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీసు కార్యాలయంలో శుక్రవారం “పోలీసు వెల్ఫేర్ డే” నిర్వహించారు. ఈసందర్భంగా సిబ్బంది వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను తెలుసుకున్నారు. వారి నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
News August 22, 2025
ఈనెల 23న స్వచ్ఛాంధ్ర నిర్వహించండి: కలెక్టర్

ఈనెల 23న 4వ శనివారం ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ అంబేడ్కర్ అధికారులకు ఆదేశించారు. గురువారం సాయంత్రం తన ఛాంబర్‌లో అధికారులతో సమీక్ష జరిపారు. ఈవారం డ్రైన్ క్లీనింగ్, పారిశుద్ధ్యం ప్రధానాంశంగా తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా నీటి నిల్వలు లేకుండా చూడడం, దోమల నివారణకు మందులు స్ప్రే చేయడం, నీటి నాణ్యతలను పరీక్షించడం, తదితర వాటిపై అవగాహన కల్పించాలన్నారు.
News August 22, 2025
VZM: ఉచిత బస్సు ప్రయాణంపై అభిప్రాయాలు చెప్పండి

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రయాణికుల స్పందన తెలుసుకునేందుకు రేపు డయల్ యువర్ ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి గురువారం తెలిపారు. శుక్రవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని, 9959225604 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. ప్రయాణికుల స్పందన, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.