News December 31, 2024
VZM: వాటి ఉనికి దాదాపు కనుమరుగు..!

కొత్త సంవత్సరం వస్తోందంటే వారం పది రోజుల ముందు గ్రీటింగ్ కార్డులు, రంగుల దుకాణాల వద్ద సందడి నెలకొని ఉండేది. ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలిపేందుకు గ్రీటింగ్ కార్డులు కొనుగోలు చేసి వారం ముందే పోస్టుల్లో పంపేవారు. అందుబాటులో ఉన్నవారికి స్వయంగా ఇచ్చేవారు. హీరో, హీరోయిన్ల ఫొటోలతో కూడిన గ్రీటింగ్స్‌కు మంచి గిరాకీ ఉండేది. ప్రస్తుతం సెల్ మోజులో పడి దాదాపు ఆ సందడి కనుమరుగయ్యిందనే చెప్పాలి.
Similar News
News September 17, 2025
గంట్యాడ: చికిత్స పొందుతూ మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ మంగళవారం మృతి చెందింది. భీమవరం గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త రాజేశ్వరి ఈనెల 12న రాత్రి గంట్యాడ మండలం కొండతామరపల్లి జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను జిల్లా కేంద్రాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 16, 2025
సీఎం సమీక్షలో విజయనగరం జిల్లా నూతన రథసారథులు

రాష్ట్రంలో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మంగళవారం నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా నూతన కలెక్టర్ ఎస్.రామ సుందరరెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.
News September 16, 2025
పేదరిక నిర్మూలనే పీ-4 లక్ష్యం: VZM జేసీ

పేదరిక నిర్మూలనే పీ-4 కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జేసీ ఎస్.సేతు మాధవన్ స్పష్టం చేశారు. మార్గదర్శులు బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని, వారిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. పీ-4 కార్యక్రమం, బంగారు కుటుంబాలు, మార్గదర్శుల పాత్రపై సచివాలయం నుంచి ఎంపిక చేసిన ఎంవోటీ, టీవోటీలకు కలెక్టరేట్లో మంగళవారం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.