News March 9, 2025

VZM: విజయవంతంగా జాతీయ లోక్ అదాలత్

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. స్థానిక కోర్టులో శనివారం ఆయన మాట్లాడుతూ.. రాజీయే రాజమార్గం నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. కక్షిదారులకు డబ్బు, సమయం ఆదా చేసామన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో మోటార్ ప్రమాద బీమా క్లెయిమ్‌కు సంబంధించి రూ. 70 లక్షల చెక్కును పంపిణీ చేశామన్నారు.

Similar News

News July 9, 2025

VZM: ‘ఆ వాహనాలను త్వరితగతిన గుర్తించాలి’

image

హిట్ అండ్ రన్ కేసుల్లో నేరానికి పాల్పడిన వాహనాలను త్వరితగతిని గుర్తించాలని SP వకుల్ జిందాల్ ఆదేశించారు. మంగళవారం ఆయన కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కేసుల్లో బాధితులకు పరిహారం చెల్లించేందకు సాక్ష్యాలను సేకరించి RDOకు పంపాలన్నారు. అలాగే వివిధ పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తులో ఉన్న 194BNSS (గుర్తు తెలియని మృతదేహాల) కేసులను సమీక్షించారు. కేసుల దర్యాప్తు అంశాలను పొందుపరచాలన్నారు.

News July 8, 2025

VZM: ‘బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియ పూర్తి చేయండి’

image

P4 కార్య‌క్ర‌మంలో భాగంగా వెంట‌నే మార్గ‌ద‌ర్శుల‌ను గుర్తించే ప్ర‌క్రియ‌ను మొదలుపెట్టాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లా అధికారులు, ఆర్‌డివోలు, నియోజ‌క‌వ‌ర్గ స్పెష‌ల్ ఆఫీస‌ర్లతో సోమ‌వారం క‌లెక్ట‌ర్ త‌మ ఛాంబ‌ర్ నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. జిల్లా వ్యాప్తంగా 67,066 బంగారు కుటుంబాల‌ను గుర్తించామని, వారి ద‌త్త‌త ప్ర‌క్రియ ఈ నెలాఖ‌రుకు పూర్తి చేయాలన్నారు.

News July 8, 2025

జిల్లా వ్యాప్తంగా 500 ఎకరాల్లో ఉద్యాన మొక్కలు: కలెక్టర్

image

ఉపాధి హామీ పథకం కింద విజయనగరం జిల్లాలో 500 ఎకరాల్లో ఉద్యాన మొక్కలను నాటనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఉద్యాన శాఖ అధికారులతో కలెక్టర్ తన ఛాంబర్‌లో సోమవారం సమీక్ష నిర్వహించారు. 8 నియోజకవర్గాల్లో ఉన్న 27 మండలాల్లో సుమారుగా 477 మంది రైతులకు మామిడి, జీడిమామిడి, కొబ్బరి, సపోటా, జామ మొదలగు 23 రకాల పండ్ల తోటలు మొక్కలు వేయుటకు సిద్ధం చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.