News September 23, 2025
VZM: శ్రీ పైడితల్లిని దర్శించుకున్న ఎస్పీ

జిల్లా ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎ.ఆర్.దామోదర్ శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించారు. అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ అధికారులు, వేద పండితులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి, వేద ఆశీర్వచనం అందించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మూడు లాంతర్లను సందర్శించి సిరిమాను తిరిగే ప్రాంతాన్ని పరిశీలించారు.
Similar News
News September 23, 2025
VZM: ఆర్టీసీలో అప్రెంటీస్ షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

విజయనగరం జిల్లా పరిధిలో గల డిపోలు, యూనిట్‌లలో షీట్ మెటల్ వర్కర్ & పెయింటర్ ట్రేడ్‌లలో అప్రెంటిషిప్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. www.apprenticeship.gov.in వెబ్‌సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
News September 23, 2025
బొండపల్లి: పిడుగుపాటుతో వ్యక్తి మృతి

బొండపల్లి మండలంలో పిడుగుపాటుతో వ్యక్తి మృతి చెందాడు. MRO రాజేశ్వరరావు వివరాల ప్రకారం.. గంట్యాడ మండలం పెదమజ్జిపాలేనికి చెందిన సుంకరి సూర్యనారాయణ (63) వెదురువాడ గ్రామానికి సమీపంలోని మామిడి తోటలో పశువులను మేతకు తీసుకెళ్లాడు. ఒక్కసారిగా పిడుగు పడడంతో సూర్యనారాయణ అక్కడిక్కడే మృతి చెందాడు. వీఆర్వో ద్వారా బొండపల్లి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు.
News September 23, 2025
పైడితల్లమ్మ పండగ ఏర్పాట్లపై ఆరా

విజయనగరం జిల్లా కేంద్రంలో కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్.దామోదర్ మంగళవారం ఉదయం పర్యటించారు. వచ్చే నెల 6,7 తేదీల్లో పైడితల్లి అమ్మ వారి పండుగ జరగనున్న నేపథ్యంలో సిరిమాను ప్రారంభించే ప్రాంతమైన హుకుంపేటను పరిశీలించారు. అనంతరం పైడితల్లమ్మ అమ్మవారి గుడికి చేరుకుని భక్తులు లోపలికి ప్రవేశించే మార్గాలపై ఆరా తీశారు. వారితో పాటు రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఉన్నారు.