News March 18, 2024
VZM: సచివాలయ ఉద్యోగి మృతి.. ఎక్స్‌గ్రేషియా అందజేత

వేపాడ(M) <<12875448>>కుంపల్లి<<>>కి చెందిన డెక్క చిరంజీవి(32) అనకాపల్లి జిల్లా దేవరాపల్లి(M) కొత్తపెంట సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిన్న ములకలాపల్లి పాలకేంద్రం వద్ద స్తంభానికి కట్టిన పోస్టర్ తొలగిస్తుండగా కరెంట్ షాక్ తగిలి మృతిచెందాడు. బాధిత కుటుంబానికి కలెక్టర్ రవి పటాన్ శెట్టి ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కుని మృతుడి భార్య హేమలతకు అందజేశారు.
Similar News
News February 12, 2026
విజయనగరం: పెట్రోలో కావలంటే..హెల్మెట్ ధరించాల్సిందే!

రహదారి భద్రతా నియమాల్లో భాగంగా రోడ్డు ప్రమాదాలు నివారించుటకు త్వరలో “నో హెల్మెట్ – నో పెట్రోల్ “ అనే నినాదాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తామని ఎస్పీ దామోదర్ తెలిపారు. పట్టణంలో బుధవారం జరిగిన వాహన తనిఖీలను పరిశీలించారు. హెల్మెట్ లేని కారణంగా ప్రాణాలు పోతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ బాధితులను గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రికి చేర్చిన వారికి రూ.5,000 ప్రోత్సాహకం ఉంటుందని స్పష్టం చేశారు.
News February 12, 2026
రీసర్వే, పాస్‌పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి: జేసీ

రీసర్వే పనులు, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన వీసీలో రీసర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని సమీక్షించారు. పెండింగ్ ఖాతాలు త్వరగా క్లియర్ చేసి, మ్యూటేషన్లు వేగంగా చేయాలన్నారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇంకా 4,765 ఖాతాలు పెండింగ్ ఉండటం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు.