News March 12, 2025

VZM: ‘సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలి’

image

సారా ర‌హిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాల‌ని అధికారుల‌ను క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. క‌లెక్ట‌రేట్లో వివిధ శాఖ‌ల అధికారుల‌తో నాటుసారా నిర్మూల‌న స‌మ‌న్వ‌య‌ స‌మావేశాన్ని బుధ‌వారం నిర్వ‌హించారు. నాటు సారాకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబ‌రు 14405 కు విస్తృత ప్ర‌చారం క‌ల్పించాల‌ని సూచించారు.

Similar News

News March 12, 2025

VZM: పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

image

ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు ప‌క‌డ్బంధీగా ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సంబంధిత అధికారులతో బుధవారం సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 119 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. 1,124 మంది చొప్పున రెండు విడతలకు 2248 మంది ఇన్విజిలేటర్లను నియమిస్తున్నట్లు చెప్పారు.

News March 12, 2025

VZM: ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వ‌ అద‌న‌పు స‌హాయం

image

ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న -గ్రామీణ్‌, అర్బ‌న్, పీఎం జ‌న్‌మ‌న్‌ ప‌థ‌కాల కింద గ‌తంలో మంజూరై నిర్మాణం మ‌ధ్య‌లో నిలిచిపోయిన ఇళ్ల‌ను పూర్తిచేసేందుకు ప్ర‌భుత్వం అద‌న‌పు స‌హాయాన్ని ప్ర‌క‌టించింద‌ని క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ వెల్ల‌డించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేసిన మొత్తానికి అద‌నంగా రాష్ట్ర ప్ర‌భుత్వం అద‌న‌పు స‌హాయాన్ని అందిస్తుందన్నారు.

News March 12, 2025

వరల్డ్ పారా అథ్లెటిక్స్‌లో కాంస్యంతో మెరిసిన లలిత

image

విజయనగరం ఉడా కాలనీకి చెందిన క్రీడాకారిణి కిల్లకి లలిత వరల్డ్ పారా అథెటిక్స్‌లో మెరిసింది. న్యూఢిల్లీ వేదికగా ప్రారంభమైన ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2025 పోటీల్లో తొలిరోజు టీ-11 విభాగం 1,500 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించింది. లలిత జిల్లాకు గర్వకారణమని పారా స్పోర్ట్స్ ప్రతినిధులు, తోటి క్రీడాకారులు అభినందించారు.

error: Content is protected !!