News February 25, 2026
VZM: సుప్రీంకోర్టు నుంచి అంటూ ఫోన్.. భారీగా దోపిడీ

విశాఖలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగికి సుప్రీంకోర్టు నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆర్టీజీఎస్ ద్వారా రూ.89 లక్షలు కాజేయడంతో నష్టపోయానని తెలుసుకున్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయనగరానికి చెందిన సీహెచ్ రవి ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News February 25, 2026
27న అనంతపురం అభివృద్ధిపై సీఎం సమీక్ష

సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 27న అనంతపురం పార్లమెంట్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. జిల్లా కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీశ్‌తో మాట్లాడి శాంతిభద్రతలు, అభివృద్ధి పనులపై వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. జిల్లాలోని ప్రధాన సమస్యలపై చర్చించేందుకు ప్రజాప్రతినిధులు ఇప్పటికే సిద్ధమయ్యారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేలా ఈ కీలక భేటీ కొనసాగనుంది.
News February 25, 2026
కాకినాడ కవయిత్రి సుమశ్రీకి ‘మహిళా కీర్తిరత్న’ పురస్కారం

కాకినాడకు చెందిన ప్రముఖ కవయిత్రి, ఉపాధ్యాయురాలు భూపతి సుమశ్రీ ‘మహిళా కీర్తిరత్న’ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. సవ్యసాచి గ్రూప్ ఆఫ్ ఇండియా, శ్రీశ్రీ కళావేదిక సంయుక్తంగా నిర్వహించే 2026 మహిళా దినోత్సవ వేడుకల్లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఆమె సాహిత్య సేవలను గుర్తిస్తూ ఈ గౌరవం దక్కినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రతిభా పురస్కారం పట్ల సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేస్తూ సుమశ్రీని అభినందించారు.
News February 25, 2026
సత్తా చాటిన ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం ప్రజాప్రతినిధుల క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పరుగు పందెంలో ఎమ్మెల్యే గద్దె ప్రథమ స్థానం సాధించగా, ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. వాలీబాల్‌లో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రొఫెషనల్ ప్లేయర్‌లా అదరగొట్టగా.. కబడ్డిలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రత్యర్థులను ఉడుంపట్టుతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.


