News August 30, 2025

VZM: స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పులు..!

image

ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన స్మార్ట్ రేషన్ కార్డుల్లో జెండర్, పుట్టిన తేదీ, పిల్లలను ఇంటి పెద్దగా, ఇంటి పెద్దని పిల్లలుగా చూపించడం, ఒక ఊరు కార్డు వేరే ఊరు వెళ్లిపోయినట్లు లబ్ధిదారులు అంటున్నారు. సంతకవిటి(M) గుళ్ళ సీతారామపురం గ్రామానికి చెందిన లబ్దిదారుని కార్డులో తప్పలు దొర్లడంతో సీఎస్ డీటీని సంప్రదించగా 20% కార్డుల్లో తప్పులు దొర్లాయని తెలిపారు. మరి మీ కార్డులో వివరాలన్నీ సరిగా ఉన్నాయా?

Similar News

News August 30, 2025

VZM: సుస్థిర గిరిజనాభివృద్దికి MOU

image

విజయనగరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హైదరాబాద్ మధ్య శనివారం MOU కుదిరింది. ఇరు సంస్థల ప్రతినిధులు శ్రీనివాసన్, సుందరం సంతకాలు చేసి పత్రాలు మార్చుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో సేంద్రీయ సాగు, ఆధునిక వరి సాగు, వ్యాధుల నియంత్రణపై శిక్షణకు MOU దోహదపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. సుస్థిర గిరిజనాభివృద్దికి MOU కుదిరిందన్నారు.

News August 30, 2025

VZM: కానిస్టేబుళ్ల వైద్య పరీక్షల షెడ్యూల్ ఇదే

image

కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులు వైద్య పరీక్షల షెడ్యూల్‌ను ఎస్పీ విడుదల చేశారు. రిజిస్ట్రేషన్ నంబర్ల ప్రకారం హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
> సెప్టెంబర్1న రిజిస్ట్రేషన్ నెంబర్ 4013323 TO 4175360, 4177478-4232439
> 2న 4234215-4347353, 4350301-4495111, 4001630-4044049
> 3న 4044111-4130825, 4132116-4189468
> 4న 4190909-4235398, 4235403-4269223
> 6న 4270844-4330310, 4330524-4511514

News August 30, 2025

VZM: జిల్లాలో జేజేఎం అమలు భేష్

image

ఇంటింటికి త్రాగు నీటిని అందించేందుకు ఉద్దేశించిన జలజీవన్ మిషన్ అమలు తీరు జిల్లాలో ప్రశంసనీయంగా ఉందని కేంద్ర బృందం అభినందించింది. బృందం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను, కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను శనివారం కలిసి, పథకం అమలుపై చర్చించారు. ప్రతీ ఇంటికి సురక్షిత త్రాగు నీరు అందించడమే ముఖ్యమంత్రి లక్ష్యమని, పథకాన్ని సంపూర్ణంగా, మరింత పటిష్ఠంగా అమలు చెయ్యాలని కోరారు.