News March 13, 2025
VZM: 15,226 మంది లబ్ధిదారులకు గుడ్ న్యూస్

నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన ఇళ్లను పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సహాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ప్రకటించిన అదనపు ఆర్ధిక సహాయంతో జిల్లాలో 15,226 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. 12,240 మంది బీసీలకు, 2,231 మంది ఎస్సీలకు ఒక్కో ఇంటికి రూ.50 వేలు, 565 మంది షెడ్యూల్డు తెగల వారికి రూ.75 వేలు, 190 మంది ఆదిమ తెగలకు రూ.లక్ష చొప్పున సహాయం అందనుంది.
Similar News
News September 13, 2025
VZM: రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు ఎంపికలు

రాష్ట్రస్థాయి జూడో పోటీల ఎంపికను ఆరికతోట జడ్పీ హైస్కూల్లో చేపట్టారు. ఇందులో 50 మంది విద్యార్థులు ఎంపికైనట్లు జిల్లా జూడో అసోషియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రత్నకిశోర్ తెలిపారు. అండర్14, 17, 19 జిల్లా జూడో టీం ఎంపిక నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 25 పాఠశాలలకు చెందిన 250 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో 25 మంది బాలికలు, 25 మంది బాలురు రాష్ట్రస్థాయి జూడో పోటీలకు వెళ్లనున్నట్లు చెప్పారు.
News September 12, 2025
విజయనగరం కలెక్టర్‌కు సన్మానం

విజయనగరం కలెక్టర్ అంబేడ్కర్‌ను జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. జిల్లా నుంచి బదిలీ అయిన నేపథ్యంలో రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో రెవెన్యూ అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు, సిబ్బంది కలెక్టర్‌ను తన ఛాంబర్లో కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
News September 12, 2025
పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష: VZM SP

తెర్లాం PSలో ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు కంకణాల కిరణ్‌కు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2వేల జరిమానాను కోర్టు విధించిందని SP వకుల్ జిందాల్ తెలిపారు. తెర్లాంకు చెందిన బాలిక నడుచుకుంటూ వెళుతుండగా అదే గ్రామానికి చెందిన కిరణ్ ఆమెను అడ్డగించి, అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయగా పారిపోయాడు. నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైనట్లు SP తెలిపారు.