News March 13, 2025
VZM: 15,226 మంది లబ్ధిదారులకు గుడ్ న్యూస్

నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన ఇళ్లను పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సహాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ప్రకటించిన అదనపు ఆర్ధిక సహాయంతో జిల్లాలో 15,226 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. 12,240 మంది బీసీలకు, 2,231 మంది ఎస్సీలకు ఒక్కో ఇంటికి రూ.50 వేలు, 565 మంది షెడ్యూల్డు తెగల వారికి రూ.75 వేలు, 190 మంది ఆదిమ తెగలకు రూ.లక్ష చొప్పున సహాయం అందనుంది.
Similar News
News March 21, 2025
నెలాఖరులోగా మంజూరును పూర్తి చేయాలి: కలెక్టర్

బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాల మేరకు ఈ నెలాఖరులోగా పథకాలను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరారు. జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా కమిటీ సమావేశం కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతిబ్యాంకుకు ఇచ్చిన లక్ష్యాల మేరకు ఈ నెలాఖరులోగా పథకాలు మంజూరు చేసి, గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని ఆదేశించారు. విశ్వకర్మపై దృష్టి సారించాలన్నారు.
News March 21, 2025
VZM: సబార్డినేట్ పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు

జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం దరఖాస్తుల తేదీని ఈనెల 22వరకు పొడిగించినట్లు జిల్లా జడ్జి సాయి కళ్యాణ చక్రవర్తి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ADR మీడియేషన్ కేంద్రంలో 2 పోస్టులను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన (SC, OC) నియామకం కోసం మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను జిల్లా కోర్ట్ భవనంలో ఉన్న న్యాయ సేవల కేంద్రంలో సమర్పించాలన్నారు.
News March 21, 2025
VZM: ఇంగ్లిష్ పరీక్షకు 98 మంది గైర్హాజరు

విజయనగరం జిల్లాలో 119 పరీక్షా కేంద్రాలలో జరుగుతున్న 10 వతరగతి పరీక్షలలో శుక్రవారం ఇంగ్లిష్ పరీక్షకు 98 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ యు.మాణిక్యం నాయుడు తెలిపారు. 22,846 విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా.. 22,748 మంది పరీక్ష రాశారన్నారు. ప్రశాంతంగా పరీక్షలు జరుగుతున్నాయని.. కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామన్నారు.