News July 19, 2024
VZM: 19న కోస్టల్ మేనేజ్ మెంట్ జోన్పై పబ్లిక్ హియరింగ్

ఏ.పి. కోస్టల్ మేనేజ్ మెంట్ జోన్ పై ఈనెల 19న ఉదయం 10-30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించనున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ సరిత తెలిపారు. కలెక్టర్ అంబేద్కర్ అధ్యక్షతన ఉదయం 10-30 గంటలకు కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో పబ్లిక్ హియరింగ్ జరుగుతుందని చెప్పారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 2019 చట్ట నిబంధనల మేరకు ఈ పబ్లిక్ హియరింగ్ జరుగుతుందని తెలిపారు.
Similar News
News October 22, 2025
VZM: సీమంతం జరిగిన రెండో రోజే భర్త మృతి

గుర్ల మండలం కొండగండ్రేడుకు చెందిన పాపినాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. భార్య సీమంతం జరిగి రెండు రోజులు గడవకముందే ఈ విషాదం చోటుచేసుకుంది. అచ్యుతాపురం నుంచి తిరిగి వస్తూ మొక్కజొన్న కంకులు ఆరబెట్టిన రోడ్డుపై బైక్ అదుపుతప్పి పడిపోవడంతో బ్రెయిన్ డెడ్తో మృతి చెందాడు. గతంలో తండ్రి అప్పలనాయుడు కూడా ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయి మరణించాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News October 22, 2025
VZM: సొంతం పేరిట దోచేస్తున్నారు.. భవిష్యత్లో ముప్పే..!

జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఇసుక అక్రమ రవాణా దందా జోరుగా కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సొంతానికి మాత్రమే ఇసుకను పట్టుకువెళ్లవచ్చునని ప్రభుత్వం మంచిగా ఆలోచిస్తే ఆ ముసుగులో అక్రమార్కులు బరి తెగుస్తున్నారు. చిన్న ఆటోలు, ఎడ్ల బళ్లతో ఇసుకను డంప్ చేస్తూ అమ్మేస్తున్నారు. నదుల్లో విచ్చలవిడి తవ్వకాలతో భవిష్యత్ లో ప్రమాదం పొంచి ఉంది. మీ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయా? కామెంట్ చేయండి.
News October 22, 2025
జిల్లాలో కార్తీక శోభ కనిపించే ఆలయాలు ఇవే..!

కార్తీకమాసంలో ఆలయాలను సందర్శిస్తే మంచి జరుగుతుందనేది భక్తుల విశ్వాసం. అందుకే ఈ మాసంలో ఏ ఆలయాల్లో చూసినా భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. జిల్లాలో రామతీర్థం రామస్వామి ఆలయం, విజయనగరంలో రామనారాయణ టెంపుల్, సారిపల్లి దిబ్బేశ్వరస్వామి ఆలయం, పుణ్యగిరి శివాలయం, గోవిందపురంలోని సంతోషిమాత ఆలయం, గంట్లాంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రతి ఏటా ఎక్కువగా భక్తుల రద్దీ ఉంటూ వస్తోంది.


