News December 31, 2024

VZM: 2024@ కొత్త ఎమ్మెల్యేలకు అవకాశం

image

2024 ఏడాది వెళ్తూ వెళ్తూ కొత్త ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చింది. కూటమి తరఫున విజయనగరం, నెల్లిమర్ల, గజపతినగరం, పార్వతీపురం, కురుపాం, బొబ్బిలి, సాలూరులో పోటీ చేసిన అదితి, లోకం నాగమాధవి, కొండపల్లి శ్రీనివాస్, విజయచంద్ర, తోయిక జగదీశ్వరి, బేబినాయన, సంధ్యారాణి ఎన్నికల్లో ఘన విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. వీరిలో కొండపల్లి శ్రీనివాస్, సంధ్యారాణికి మంత్రి పదవులు కూడా దక్కాయి.

Similar News

News January 3, 2025

విజయనగరం: లవ్ మ్యారేజ్.. దంపతుల సూసైడ్

image

విజయనగరం జిల్లాకు చెందిన దంపతులు పెందుర్తి మండలం పురుషోత్త పురంలో ఉరివేసుకుని చనిపోయారు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. చీపురుపల్లికి చెందిన సంతోష్ (35) విశాఖకు చెందిన సంతోష్ శ్రీ (25) లవ్ చేసుకున్నారు. ఆరేళ్ల క్రితం పెళ్లి కాగా పిల్లలు లేరు. దీంతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరివేసుకుని మృతిచెందారు. పెందుర్తి పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 3, 2025

VZM: కానిస్టేబుల్ ఉద్యోగాలు.. 259 మంది గైర్హాజరు

image

విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది . మొత్తం 600 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 341 మంది అభ్యర్థులు మాత్రమే PMT, PET పరీక్షలకు హాజరయ్యారు. రెండో రోజు 259 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కాగా ఎంపిక ప్రక్రియ గురువారం ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జరిగింది.

News January 3, 2025

VZM: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

విజయనగరంలోని NTR నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో గృహిణులు, యువతులకు వివిధ వృత్తి శిక్షణ కోర్సుల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ విమల తెలిపారు. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన వారు అర్హులన్నారు. కోర్సుని బట్టి 30 నుంచి 60 రోజుల శిక్షణ వ్యవధి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన మహిళలు, యువతులు జనవరి 10వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.