News October 11, 2024

VZM: 23న న‌ర్సింగ్ అసోసియేష‌న్‌కు ఎన్నిక‌లు

image

ఏపీ న‌ర్సింగ్ అసోసియేష‌న్ విజ‌య‌న‌గ‌రం యూనిట్‌కు ఈ నెల 23న ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎన్నిక‌ల అధికారి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రిజ్వాన్ ష‌రీఫ్ తెలిపారు. ఓట‌ర్ల జాబితాపై అభ్యంత‌రాల స్వీక‌ర‌ణ‌కు విజ‌య‌న‌గ‌రం ప్ర‌భుత్వ స‌ర్వ‌జ‌న ఆసుప‌త్రి, జిల్లా వైద్యారోగ్య‌శాఖ కార్యాల‌య నోటీసు బోర్డులో వివ‌రాల‌ను ఉంచిన‌ట్లు వెల్లగించారు. ఇప్ప‌టికే ఎన్నిక‌ల‌పై అందరికి అవ‌గాహ‌న క‌ల్పించామ‌న్నారు.

Similar News

News November 6, 2024

VZM: ఎన్నికల నియమావళి అమలుకు బృందాల ఏర్పాటు

image

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంగా విజయనగరం జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కోసం అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించినట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. మున్సిపల్ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, MRO, MPDO, SI సభ్యులుగా ఉంటారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో  MRO, MPDO, ఎస్ఐ ఈ బృందంలో సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు.

News November 5, 2024

VZM: సింగిల్ విండో ద్వారా రాజకీయ పార్టీలకు అనుమతులు

image

విజయనగరం జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి రాజకీయ పార్టీల అభ్యర్థులకు సింగిల్ విండో ద్వారా అవసరమైన అనుమతులు మంజూరు చేయనున్నట్టు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అంబేడ్కర్ వెల్లడించారు. ఈ సింగిల్ విండో సెల్‌కు నోడల్ అధికారిగా ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఎల్.జోసెఫ్ వ్యవహరిస్తారని, బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రదర్శనల నిర్వహణకు అనుమతులు ఆయనే ఇస్తారని చెప్పారు.

News November 5, 2024

VZM: టెట్ టాపర్లకు కలెక్టర్ అభినందనలు

image

టెట్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపి, రాష్ట్ర‌స్థాయిలో మొద‌టి, రెండ‌వ ర్యాంకులను సాధించిన విద్యార్థినుల‌ను విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ అభినందించారు. టెట్‌లో జిల్లాకు చెందిన కోండ్రు అశ్వ‌ని 150/150 మార్కులను, దాస‌రి ధ‌న‌ల‌క్ష్మి 149.99 మార్కుల‌ను సాధించి రాష్ట్ర‌స్థాయిలో ప్ర‌ధ‌మ‌, ద్వితీయ స్థానంలో నిలిచారు. అలాగే 149.56 మార్కుల‌ను సాధించిన‌ దేవ హారికకు అభినందనలు తెలిపారు.