News July 20, 2024

VZM: 24 గంటలు Be Alert

image

జిల్లాలో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లోని వాగులు, గెడ్డలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో అన్ని మండలాల తహశీల్దార్, రెవెన్యూ డివిజన్‌లను అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా.బీ.ఆర్. అంబేడ్కర్ ఆదేశించారు. వాగులు, గెడ్డలు ప్రవాహం కొనసాగుతున్న ప్రదేశాల్లో ఎవరూ వాటిని దాటకుండా, ప్రమాదాలు జరగకుండా 24 గంటల పహారా ఏర్పాట్లు చేయాలన్నారు. భారీ వర్షాల దృష్ట్యా ఈ రోజు అన్నీ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

Similar News

News December 13, 2024

భోగాపురం: చిట్టీల కేసులో భార్య, భర్త అరెస్ట్

image

చీటీలు, స్కీములు నిర్వహించి సుమారు రూ.2 కోట్లు వరకు మోసం చేసిన భీమిలి మండలం వలందపేటకు చెందిన భార్యాభర్తలు సరగడపార్వతీ, లక్ష్మణరెడ్డిలను అరెస్టు చేసినట్లు సీఐ ఎన్వీ ప్రభాకర్ తెలిపారు. భోగాపురం మండలం చెరుకుపల్లిలో చీటీలు, రకరకాల స్కీములు నిర్వహించి గ్రామస్థుల నుంచి సుమారు రూ.2 కోట్లు చీటింగ్ చేసినట్లు ఆ గ్రామానికి చెందిన మజ్జి త్రినాథమ్మ ఫిర్యాదుతో దర్యాప్తు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.

News December 13, 2024

మక్కువ: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

image

మక్కువ మండలంలోని శంబర రహదారి సమీపంలో ఇటుక బట్టి వద్ద పని చేస్తున్న అంజిబాబు విద్యుత్ షాక్‌కు గురై గురువారం మృతి చెందాడు. యానాదుల వీధికి చెందిన అంజిబాబు గత కొన్ని ఏళ్లుగా ఇటుక బట్టి వద్ద పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రమాదవశాత్తు ఐరన్ పైపులను తాకడంతో వెంటనే షాక్ గురయ్యాడు. స్థానికులు ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News December 11, 2024

గూగుల్‌తో ఎంవోయూ చేసుకున్నాం: సీఎం చంద్రబాబు

image

అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ సమావేశానికి ముందు విశాఖలో గూగుల్‌ ఏర్పాటుకు ఎంవోయూ చేసుకున్నామన్నారు. ఇటీవల విశాఖలో గూగుల్ ప్రతినిధులు పర్యటించి సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. గూగుల్ విశాఖకు వచ్చాక గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. డేటా సెంటర్, ఏఐ, మెషీన్ లెర్నింగ్, డీప్‌టెక్, సీకేబుల్ వచ్చాక ప్రపంచానికే విశాఖ సర్వీస్ సెంటర్ అవుతుందని పేర్కొన్నారు.