News May 24, 2024
VZM: 25న పరీక్ష.. 8:30 లోపు చేరుకోవాలి

APPSC డిప్యూటీ డీఈవో నియామక పరీక్షను ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నారు. కాగా ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ఉదయం 8:30 లోపు చేరుకోవాలని DRO అనిత తెలిపారు. ఉదయం 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారన్నారు. పరీక్షా నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆమె శుక్రవారం సమీక్షించి పలు సూచనలు చేశారు.
Similar News
News February 13, 2025
రాజాం : తండ్రిని చూసేందుకు వెళ్లి దారిలో మృతి

రాజాం కాంప్లెక్స్ ఆవరణలో కాలువలో బుధవారం మెరకముడిదాంకి చెందిన మజ్జి రామకృష్ణ మృతి చెందిన విషయం <<15436428>>తెలిసిందే<<>>. శ్రీకాకుళంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రిని చూసేందుకు రామకృష్ణ రాజాం వచ్చాడు. కాంప్లెక్స్‌లో బైక్ ఉంచి బస్సులో వెళ్లాడు. రాత్రి తిరిగి కాంప్లెక్స్‌కి చేరుకున్నాడు. ఈక్రమంలో గుండెపోటు వచ్చి కాలువలో పడిపోగా ఎవరు చూడకపోవడంతో మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
News February 13, 2025
వంగర: ఉరి వేసుకొని వ్యక్తి మృతి

మెరకముడిదాంకు చెందిన శ్రీరాములు(52) చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. దీంతో వంగర మండలం చౌదరివలసలోని తన భార్య చెల్లెలు రమణమ్మ ఇంటికి వచ్చి ఆమెను డబ్బులు అడిగాడు. తను లేవని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బుధవారం చౌదరివలస సమీప తోటలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 13, 2025
MSP సేవలను క్షేత్రస్థాయిలో వినియోగించుకోవాలి: VZM SP

క్షేత్ర స్థాయిలో MSPల సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. విధి నిర్వహణ పట్ల MSPలకు దిశా నిర్దేశం చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. క్షేత్ర స్థాయిలో వారి సేవలను మరింత మెరుగ్గా వినియోగించుకోవాలని కోరారు. ప్రతీ వారం MSPలతో సమావేశాలు నిర్వహించి, క్షేత్ర స్థాయిలో విషయాలను తెలుసుకోవాలన్నారు.