News March 29, 2024
VZM: 25 శాతం సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
2024-25 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ప్రైవేట్, అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచిత సీట్లకు విద్యార్థులు మార్చి 31వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా డీఈవో తెలిపారు. సెంట్రల్ లేదా రాష్ట్ర సిలబస్‌లో విద్యనభ్యసించేందుకు దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు. ఆర్‌టిఈ చట్టంలోని సెక్షన్ 12(1) (సి) 2009 అనుసరించి 25 శాతం సీట్లను భర్తీ చేస్తామని తెలిపారు.
Similar News
News January 17, 2025
VZM: కానిస్టేబుల్ ఎంపికలు.. 185 మంది గైర్హాజరు
విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల దేహ దారుఢ్య ఎంపిక ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 600 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 415 మంది అభ్యర్థులు PMT, PET పరీక్షలకు హాజరయ్యారు. 185 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
News January 16, 2025
సీతానగరం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
సీతానగరం మండలం మరిపివలస గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు లోలుగు రాంబాబు (44), అతని కుమారుడు మోక్ష శ్రీహాన్ (5) తమ కుటుంబ కలిసి వెళ్తుండగా వెనకనుంచి లారీ ఢీకొనడంతో మృతి చెందారు. పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తున్నారు.
News January 16, 2025
VZM: కానిస్టేబుల్ ఎంపికలు.. 185 మంది గైర్హాజరు
విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల దేహ దారుఢ్య ఎంపిక ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 600 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 415 మంది అభ్యర్థులు PMT, PET పరీక్షలకు హాజరయ్యారు. 185 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కాగా ఎంపిక ప్రక్రియ శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి జరిగింది.