News March 29, 2024
VZM: 25 శాతం సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

2024-25 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ప్రైవేట్, అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచిత సీట్లకు విద్యార్థులు మార్చి 31వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని జిల్లా డీఈవో తెలిపారు. సెంట్రల్ లేదా రాష్ట్ర సిలబస్‌లో విద్యనభ్యసించేందుకు దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు. ఆర్‌టిఈ చట్టంలోని సెక్షన్ 12(1) (సి) 2009 అనుసరించి 25 శాతం సీట్లను భర్తీ చేస్తామని తెలిపారు.
Similar News
News September 25, 2025
VZM: రేపు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పర్యటన

రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విమలారాణి గురువారం తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగే ‘నవరాత్రి పోషణ్ మహా ప్రోగ్రాం’ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం వన్ స్టాప్ సెంటర్‌ను సందర్శించనున్నారని చెప్పారు.
News September 25, 2025
స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం ప్రారంభించిన కలెక్టర్

విజయనగరం కలెక్టరేట్‌లో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ తమ పరిసరాల పరిశుభ్రతకు పాటు పడాలని పిలుపునిచ్చారు. రోజుకో ఓ గంట సమయం సేవకు కేటాయించాలని కలెక్టర్ సిబ్బందికి చెప్పారు. కలెక్టర్‌తో పాటు జేసీ సేదుమాధవన్, అధికారులు, నాయకులు, మున్సిపల్ తదితరులు ఉన్నారు.
News September 25, 2025
ఓటర్ల జాబితాను మ్యాప్ చేయండి: VZM కలెక్టర్

ఓటర్ల జాబితా సవరణ పై కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో కలెక్టర్ రామ సుందర్ రెడ్డి బుధవారం సమీక్షించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2002 ఓటర్ల జాబితాతో 2025 ఓటర్ల జాబితాను మ్యాప్ చేయాలని తెలిపారు. ఓటర్ల సవరణ కోసం అందిన ఫారం 6, 7, 8ని నిర్దేశిత గడువు లోగా డిస్పోజ్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.