News October 17, 2024
VZM: 29 నుంచి వైద్యసేవ క్షేత్ర సిబ్బంది సమ్మె
డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో పనిచేస్తున్న క్షేత్ర సిబ్బంది సమస్యలు 17 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదని ఏపీ వైద్యమిత్ర ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జె.ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై ఉన్నతాధికారులకు ఇప్పటికే వినతిపత్రం అందజేశామని, ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి వెళుతున్నట్లు తెలిపారు.
Similar News
News November 14, 2024
ప్యానల్ స్పీకర్ల జాబితాలో ఎస్.కోట MLA
అసెంబ్లీలో కోళ్ల లలిత కుమారీకి కీలక పదవి దక్కింది. పలువురు ఎమ్మెల్యేలను ప్యానల్ స్పీకర్‌లుగా నియమించారు. ఈ జాబితాలో ఎస్.కోట ఎమ్మెల్యే ఉన్నారు. రెగ్యులర్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేనప్పుడు.. కోళ్ల లలిత కుమారీ కుర్చీలో కూర్చుని అసెంబ్లీని నడుపుతారు. కాగా కోళ్ల లలిత కుమారి మూడో సారి టీడీపీ నుంచి ఎస్.కోట ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీకి వెళ్లారు.
News November 14, 2024
నిందితుల వేలిముద్రలను సేకరించండి:SP
విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో మాసాంతర నేర సమీక్ష సమావేశాన్ని ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసుల నమోదు, దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలన్నారు. 7 సంవత్సరాలకు పైబడి శిక్ష పడే అన్ని కేసుల్లో అరెస్టు కాబడిన నిందితుల వేలిముద్రలను లైవ్ స్కానర్లలో తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో బెల్టు షాపులు లేకుండా చూడాలని ఆదేశించారు.
News November 14, 2024
బూర్జవలస పోలీస్ స్టేషన్ పైకి దూసుకెళ్లిన కంటైనర్
దత్తిరాజేరు మండలంలోని బూర్జవలసలో ఓ కంటైనర్ భీభత్సం సృష్టించింది. బుధవారం రాత్రి వాహనం అదుపుతప్పి నేరుగా బూర్జవలస పోలీస్ స్టేషన్‌పైకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో స్టేషన్ గోడ ధ్వంసం కాగా.. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.