News September 3, 2024
VZM: ‘5 నుంచి జిల్లాలో భారీ వర్షాలు’

ఈ నెల 5 నుంచి 7వ తేదీవరకు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మడ్డువలస రిజర్వాయర్లో ఇన్ఫ్లో ఇప్పటికే ఎక్కువగా ఉందని ఇప్పటినుంచే అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News November 11, 2025
సీఎం స్ఫూర్తితోనే ముందుకు వచ్చాను: రామ్మోహన్రావు

నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి పెట్టుబడిదారుడిగా ఎదిగానని పారిశ్రామికవేత్త రామ్మోహన్రావు తెలిపారు. బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా ఆయన CMతో వర్చువల్గా మాట్లాడారు. 2017 CIIసదస్సులో CM సమక్షంలో MOU కుదిరిందని, అప్పటి నుంచి చంద్రబాబు స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నానన్నారు. రూ.500 కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా 500 మంది, పరోక్షంగా 5 వేల మంది రైతులకు ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు.
News November 11, 2025
పెట్టుబడులు పెట్టే స్థాయికి యువత ఎదగాలి: సీఎం చంద్రబాబు

వంగర మండలంలోని అరసాడలో రూ.102 కోట్లతో నిర్మించనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కి ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి వర్చువల్గా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పెట్టుబడులకు ఆకర్షితులు కాకుండా పెట్టుబడులు పెట్టే స్థాయికి యువత ఎదగాలని పిలుపునిచ్చారు. యువ పారిశ్రామికవేత్తలు మట్టిలో మాణిక్యాలు అని, ప్రభుత్వ అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని ఆకాంక్షించారు.
News November 11, 2025
VZM: సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలకు అప్లై చేశారా?

సఫాయి కర్మచారి యువతకు 3 సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు సబ్సిడీపై ఇవ్వనున్నారు.
➤యూనిట్ విలువ: రూ.31,67,326
➤సబ్సిడీ: రూ.14,16,831
➤రుణ మొత్తం: రూ17,50,495, వడ్డీ రేటు: 6%
➤చెల్లింపు కాలం: 72 నెలలు (ప్రతి నెల రూ.33,064 వాయిదా)
➤గ్రూప్: 5 మంది అభ్యర్థులు ఉండాలి
➤అప్లై చేసే స్థలం: జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ, మర్రి చెన్నారెడ్డి భవనం, కంటోన్మెంట్, విజయనగరం
➤చివరి తేదీ: 20-11-2025


