News September 3, 2024

VZM: ‘5 నుంచి జిల్లాలో భారీ వ‌ర్షాలు’

image

ఈ నెల 5 నుంచి 7వ తేదీవ‌ర‌కు జిల్లాలో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని, అలాగే బంగాళాఖాతంలో మ‌రో అల్ప‌పీడ‌నం కూడా ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ తెలిపారు. అధికారులతో మంగ‌ళ‌వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా యంత్రాంగమంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు. మడ్డువలస రిజర్వాయర్‌లో ఇన్‌ఫ్లో ఇప్ప‌టికే ఎక్కువ‌గా ఉంద‌ని ఇప్ప‌టినుంచే అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News December 29, 2025

వారం రోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు: SP

image

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ దామోదర్ ప్రజల నుంచి 19 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో భూ వివాదాలు 8, కుటుంబ కలహాలు 3, నగదు వ్యవహారం 1, ఇతర అంశాలపై 7 ఫిర్యాదులు ఉన్నట్లు తెలిపారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, వాస్తవాలను పరిశీలించి, 7 రోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

News December 29, 2025

విజయనగరం కలెక్టరేట్‌కు పోటెత్తిన అర్జీదారులు

image

విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు అర్జీదారులు పోటెత్తారు. ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 232 వినతులు స్వీకరించారు. వచ్చిన వినతులను వారంలోగా పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి వారం పీజీఆర్ఎస్‌పై సమీక్షిస్తామన్నారు.

News December 29, 2025

నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి: SP

image

నూతన సంవత్సర వేడుకలను జిల్లాలోని ప్రజలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఏఆర్ దామోదర్ సోమవారం తెలిపారు. డిసెంబర్ 31న రాత్రి బహిరంగ ప్రదేశాలు, రహదారులపై వేడుకలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.