News September 5, 2025
VZM: 7న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ల రాత పరీక్ష

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈనెల 7న నిర్వహించనున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌ల రాత పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాస మూర్తి ఆదేశించారు. ఈ పరీక్షకు చేయాల్సిన ఏర్పాట్లపై విజయనగరం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అభ్యర్థులు హాల్ టిక్కెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డును తీసుకురావాలన్నారు.
Similar News
News September 5, 2025
ముస్లింల ర్యాలీలు ప్రశాంతంగా ముగిశాయి: SP

విజయనగరం జిల్లాలో ‘ఈద్ మిలాద్ ఉన్ నబీ’ పండగ సందర్భంగా జిల్లా కేంద్రంలోనూ, ఇతర ప్రాంతాల్లో ముస్లింలు చేపట్టిన ర్యాలీలు ప్రశాంతంగా ముగిశాయని ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం తెలిపారు. పట్టణంలో సుమారు 1500 మందితో భారీ ర్యాలీ చేపట్టగా, ఎటువంటి ఘటనలు జరగకుండా తమ సిబ్బంది బందోబస్తు నిర్వహించారన్నారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారని చెప్పారు.
News September 5, 2025
VZM: ఐటీఐ ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్‌లో 600/600

ఇటీవల జరిగిన ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్‌లో విజయనగరం ప్రభుత్వ ఐటీఐ విద్యార్థి ఎర్ల సాయి సత్తా చాటాడు. సీనియర్ ఎలక్ట్రీషియన్ విభాగంలో 600/600 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడని ప్రిన్సిపల్ టీవీ గిరి తెలిపారు. సీనియర్ ఎలక్ట్రీషియన్ విభాగంలో 590 ప్లస్ మార్కులను ఆరుగురు విద్యార్థులు సంపాదించారన్నారు. జూనియర్ విభాగంలో కూడా మంచి ఉత్తీర్ణత నమోదైందని వెల్లడించారు.
News September 5, 2025
VZM: ‘13న కేసులు రాజీ చేసుకోండి’

విజయనగరం జిల్లా కోర్టు ప్రాంగణంలో సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రసాద్ గురువారం తెలిపారు. వాహన ప్రమాదాలు, బ్యాంకులకు సంబంధించిన కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, NIA యాక్ట్, ఎక్సైజ్ కేసులు, కుటుంబ వివాదాలు, కార్మిక సంబంధిత, సివిల్ కేసులను కూడా పరిష్కరించుకోవచ్చన్నారు. నూతన కోర్డు భవనంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు.