News January 6, 2025

VZM: ‘8న జరగాల్సిన పరీక్ష 11కు వాయిదా’

image

కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షల్లో అధికారులు స్వల్ప మార్పు చేశారు. ఈనెల 8న జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలను 11కి వాయిదా వేసినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్ ఎం.రవి ప్రకాశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి విజయనగరం జిల్లాతో పాటు పీఈటీ పరీక్షలు జరిగే శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో అభ్యర్థులు గమనించాలని కోరారు.

Similar News

News February 27, 2026

విజయనగరం: సైకో కిల్లర్ ఉపేంద్ర బాబు హత్య

image

అనకాపల్లి(D) మాడుగుల(M) జంపినకు చెందిన సీరియల్ సైకో కిల్లర్ పెచ్చేటి ఉపేంద్ర బాబును గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఉపేంద్ర బాబు ఐదు మర్డర్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల విజయనగరం జిల్లాలో చేసిన దొంగతనం కేసులో జైలుకు వెళ్లి, బెయిల్ మీద బయటకు వచ్చాడు. కాగా మారణాయుధాలతో ఉపేంద్ర బాబును హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్నివివరాలు తెలియాల్సి ఉంది.

News February 27, 2026

VZM: జిల్లాలో 122 కొత్త పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు

image

ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి కోరారు. గురువారం అయన ఛాంబర్‌లో పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. విజయనగరం జిల్లాలో మొత్తం 15,76,018 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం 1,847 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. కొత్తగా 122 స్టేషన్లకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. గుర్తింపు పొందిన పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలన్నారు.