News March 17, 2024

VZM: బాక్సింగ్‌లో బంగారు పథకం సాధించిన సచిన్

image

విశాఖపట్నంలో జరిగిన మూడవ రాష్ట్ర సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో విజయనగరం క్రీడాకారుడు బి. సచిన్‌ బంగారు పతాకం సాధించాడు. మార్చి 18 నుంచి 25 వరకు ఉత్తర ప్రదేశ్‌లో జరగబోయే జాతీయస్థాయి పోటీలలో ఆంధ్రప్రదేశ్ తరుఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ మేరకు ఆదివారం అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డోల మన్మథకుమార్ ఆయనకు అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాక్షించారు.

Similar News

News October 31, 2024

సింహాచలం ఆలయంలో నేడు నరకాసుర వధ

image

నరక చతుర్దశి సందర్భంగా గురువారం సింహాచలం ఆలయ ప్రాంగణంలో నరకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పూర్తి చేశారు. నరకాసురుడి విగ్రహాన్ని ఒక పల్లకిలోను సింహాద్రి అప్పన్న, శ్రీదేవి, భూదేవి సమేతంగా మరొక వాహనంలోను ఎదురెదురుగా తీసుకువచ్చి నరకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తారు. స్వామివారి దర్శనాలు సాయంత్రం 5 గంటల వరకే లభిస్తాయి.

News October 30, 2024

విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు 

image

నవంబర్ 2న సీఎం చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. గత ఐదేళ్లలో తీవ్రంగా దెబ్బతిన్న రహదారుల మరమ్మతు పనులను ఆయన జిల్లానుంచి ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా ఆయన ఆరోజు ఉదయం 10.30 గంటలకు కొత్తవలస మండలం దెందేరు జంక్షన్ వద్ద పనులకు శ్రీకారం చుడతారు. సుమారు రూ.826 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా గోతులు పూడ్చే పనులను తమ స్వహస్తాలతో ప్రారంభిస్తారు.

News October 30, 2024

నెల్లిమర్ల: EVM గోదాములను పరిశీలించిన కలెక్టర్

image

నెల్లిమర్లలోని EVM గోదాముల‌ను క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ బుధవారం త‌నిఖీ చేశారు. గోదాముల‌కు వేసిన సీళ్ల‌ను ప‌రిశీలించిన ఆయన EVMల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ త‌నిఖీల్లో డీఆర్వో ఎస్.శ్రీనివాస మూర్తి, ఆర్డీవో డీ.కీర్తి, కలెక్టరేట్ ఎన్నిక‌ల విభాగం సూప‌రింటెండెంట్ భాస్క‌ర్రావు, నెల్లిమ‌ర్ల ఎమ్మార్వో సుద‌ర్శ‌న్‌, ఇత‌ర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.