News March 18, 2024

VZM: సచివాలయ ఉద్యోగి మృతి

image

విజయనగరం జిల్లా వేపాడ(M) కుంపల్లికి చెందిన వ్యక్తి కరెంట్ షాక్‌తో చనిపోయాడు. డెక్క చిరంజీవి(32) అనకాపల్లి జిల్లా దేవరాపల్లి(M) కొత్తపెంట సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిన్న ములకలాపల్లి పాలకేంద్రం వద్ద స్తంభానికి కట్టిన పోస్టర్‌ తొలగిస్తుండగా కరెంట్ షాక్‌ తగిలి మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. SI డి.నాగేంద్ర ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

Similar News

News February 11, 2026

VZM: లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి

image

మార్చి 14వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత కోరారు. బుధవారం బార్ అసోసియేషన్ సభ్యులు, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాదులతో జిల్లా కోర్టులో ఆమె సమావేశం నిర్వహించారు. ప్రమాద బీమా క్లెయిమ్ కేసులు అన్ని సివిల్ దావాలు లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలన్నారు. ఎక్కువ కేసులు రాజీ చేసి కక్షిదారులకు డబ్బు, సమయం వృధా కాకుండా చూడాలన్నారు.

News February 11, 2026

VZM: ‘కేంద్ర ప్రభుత్వ నిధులు మార్చిలోగా వినియోగించాలి’

image

కేంద్ర ప్రభుత్వ నిధులను మార్చిలోగా పూర్తిగా వినియోగించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం విజయనగరం కలెక్టరేట్లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. నిధుల వినియోగంపై సమీక్షించారు. వివిధ పథకాలను అందుబాటులో ఉన్న సుమారు రూ.40 కోట్లను మార్చి 15 లోగా ఖర్చు చేయడానికి కార్యాచరణ తయారు చేయాలని ఆదేశించారు.

News February 11, 2026

VZM: పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

image

పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను బుధవారం ఆదేశించారు. మార్చి 16 నుంచి జరగనున్న పరీక్షల నిర్వహణకు 119 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. విజయనగరం జిల్లాలోని MRO, MPDO, మున్సిపల్ కమిషనర్లతో కేంద్రాలను ముందుగానే తనిఖీ చేయించి నివేదిక ఇవ్వాలన్నారు. విద్యార్థులు అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని, అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.